Anantapur Accident: శీతాకాలం వేళ రోడ్డు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీలో కనీసం రోజుకు అరడజనుకు పైగా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుపాన్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండల, పట్టణం నుంచి దాదాపు 9 మంది వ్యక్తులు హైదరాబాద్‌లోకి ఓ పెళ్లి వెళ్లారు. వివాహం తర్వాత సొంతూరుకు తిరిగి వస్తున్నారు. అనంతపురం జిల్లా రాయల చెరువు వద్ద తుపాన్ వాహనం క్రాస్ చేస్తుండగా, కుడి వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ.. బలంగా ఢీ కొట్టింది. ఘటన సమయంలో తుపాన్ వాహనంలో 9 మంది ఉన్నారు.
అందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో తుపాన్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సాయంలో అతి కష్టం మీద బయటకు తీశారు. ఆ ప్రాంతం చీకటిగా ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందిగా మారింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు.
ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనాస్థలికి డీఎస్పీ చంద్రశేఖర్ చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు మిద్దె హనుమంతరెడ్డి-31, సుహాసిని-26, మల్లికార్జునశెట్టి-30, మిద్దె వీరాంజనేయులురెడ్డి- 52 లుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్: సీఎం చంద్రబాబు
మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జరిగిన ఘటనపై బాధితుల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.