E-Paper
Advertisement

Sajjala: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం

Sajjala: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం
Advertisement

Sajjala: చంద్రబాబు సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ఒక జిల్లాకు సంబంధించిన సమస్య కాదని అన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టుతోపాటు మిగిలిన ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకు వేదిక కావాలన్నారు.

సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహం

Advertisement

రూ. 3500 కోట్లతో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం మరో ఆరు నెలలు ఉంటే పూర్తయ్యేద న్నారు. టీడీపీ సానుభూతి పరులతో ఎన్జీటిలో కేసు వేయించి అడ్డుకున్నారని ఆరోపించారు. జనం కోసం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విషయంలో జగన్ ప్రభుత్వం తప్పు చేసిందని నింద వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ నిందలను తిప్పికొట్టే పరిస్తితి రావాలన్నారు.

ఆదివారం కడపలో మీడియాలో మాట్లాడిన ఆయన,  జనంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై అవగాహన రావాలన్నారు. దీనిపై ప్రతి ఇంట్లో దీనిపై చర్చ చేస్తున్నారని, కూటమి చేస్తున్న తప్పులను నిలదీసే పరిస్తితి రావాలన్నారు. జనం ప్రశ్నించడం మొదలు పెడితే ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి ఉండదన్నారు.

Advertisement

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. సజ్జల కొత్త పలుకులు

ఇప్పటివరకు వైసీపీ ఈ స్థాయిలో కలిసి ఒకచోట చర్చించలేదన్నారు. కూటమి తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ జనంలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేదంటున్నారని, కోలుకోకపోతే మూడు నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి దాపురిస్తుందన్నారు. వైఎస్‌ఆర్ చేపట్టిన జల యజ్ఞంకు కొనసాగింపుగా రాయలసీమ ఎత్తిపోతల జగన్ చేపట్టారని అన్నారు.

రాయలసీమ అవసరం లేదంటూ పదే పదే చెబుతున్నారని, దాన్ని తిప్పికొట్టేందుకు రౌండ్ టేబుల్ సమావేశం కోసం కీలక నిర్ణయం తీసుకోనుందన్నారు. తెలంగాణ.. జూరాల, శ్రీశైలం నుంచి 8 టీఎంసీలు నీటిని తీసుకున్నారని గుర్తు చేశారు. ఏ అనుమతులతో తెలంగాణా ప్రాజెక్టులు కట్టిందని ప్రశ్నించారు.

ALSO READ: డీప్ ఫేక్ వీడియోలతో ప్రచారం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

ఆల్మట్టి ఎత్తు ఎలాంటి  అనుమతులతో కట్టారని, జగన్ అనుమతులు తీసుకోకుండానే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతలపై ఎలాంటి ప్రకటన చేయలేదని, అనుమతులకోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.

నీటి వినియోగంపై ఏర్పాటైన కేంద్ర జలవనరుల శాఖ నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వం సరిగా వెళ్లని పరిస్తితి నెలకుందన్నారు. పొరుగు రాష్ట్రాలు చేస్తున్న పనిని అడ్డుకోకుంటే భవిషత్‌లో నీటి హక్కులు ఎలా వస్తాయని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం అడ్డుకోక పోవడం దారుణమన్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×