E-Paper
Advertisement

చరిత్ర తిరగరాసిన వైసీపీ.. జగన్‌కు దెబ్బ మీద దెబ్బ, మళ్లీ ఏం జరిగింది?

చరిత్ర తిరగరాసిన వైసీపీ.. జగన్‌కు దెబ్బ మీద దెబ్బ, మళ్లీ ఏం జరిగింది?
Advertisement

Jagan: అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర తిరగరాయాలన్నా మేమే అంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. ఆనాడు ఆ విషయం ఎందుకు చెప్పారో ప్రజలకు ఇప్పుడే అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమాని అన్ని రికార్డులు బద్దలు కొట్టేసింది వైసీపీ. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలు కూటమి దెబ్బకు బీటలు పడ్డాయి. సొంత గ్రామం బలపనూరు పంచాయతీపై తొలిసారి టీడీపీ జెండా రెపరెపలాడింది.

జగన్‌కు దెబ్బ మీద దెబ్బ

వైసీపీ అధినేత జగన్‌కు కాలం కలిసి రాలేదు. ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు గ్రహాలు ఏ మాత్రం అనుకూలించలేదు. 2014-19 కంటే ఇప్పుడు బ్యాడ్ టైమ్ మొదలైంది. ఒకప్పుడు జగన్ గురించి ప్రజలకు తెలిసేది కాదు. ఆస్తుల వ్యవహారంలో జగన్ ఆలోచన తీరు ప్రజలకు అర్థమైపోయింది. ఆ పార్టీ వైపు చూసేందుకు ప్రజలు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. సోదరి విషయంలో మంచి కంటే, చెడు ఎక్కువగా మూట గట్టుకున్నారు జగన్. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం.

Advertisement

అసలు విషయానికి వచ్చేద్దాం.. వైసీపీ అధినేత జగన్‌ సొంత గ్రామం బలపనూరు పంచాయతీ ఎన్నికల్లో ఎదురు గాలి వీచింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అక్కడ టీడీపీ జెండా రెపరెపలాడింది. కూటమి మద్దతుతో అనిల్‌కుమార్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీలో 40 ఏళ్ల తర్వాత టీడీపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి.

చరిత్ర తిరగరాసిన వైసీపీ

కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు పంచాయతీ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఎలాంటి ఎన్నికలు తుఫాన్లు వచ్చినా, ఆ ఫ్యామిలీ హవా ఏ మాత్రం చెక్క చెదరలేదు. 2026 ఎన్నికల్లో సొంత పంచాయితీ, పులివెందుల మున్సిపాలిటీ, కడప కార్పొరేషన్, చివరకు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైఎస్ ఫ్యామిలీ కోటలు బీటలు పడ్డాయి. ఏపీ చరిత్రలో కనీవినీ ఊహించని ఘోర పరాజయం కూడా.

Advertisement

పులివెందుల నియోజకవర్గంలో బలపనూరు పంచాయతీ జగన్‌ సొంత గ్రామం. 2269 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో సర్పంచి ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీదే ఆధిపత్యం. ఈసారి వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు కనీసం నామినేషన్‌ వేసేందుకు ముందుకు రాలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు. ఎంపీటీసీ ఎన్నికల్లో అనిల్‌కుమార్‌ రెడ్డి ఫ్యామిలీ గెలుచుకుంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కొత్తరెడ్డి రవిచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచి, ఎంపీటీసీ రెండు ఒకే కుటుంబం దక్కించుకోవడం విశేషం.

పులివెందుల నియోజకవర్గం పరిధిలో 100 కు పైగానే పంచాయతీలు ఉన్నాయి. అందులో టీడీపీ మద్దతుదారులు 42 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింహాద్రిపురంలో 20 పంచాయతీలకు గాను 18 టీడీపీ ఖాతాలో పడ్డాయి. రావులకొలను, పైడిపాలెం పంచాయతీల్లో పోటీ నెలకొంది. తొండూరు- 9 పంచాయతీలు, వేముల- 7, చక్రాయపేట- 5, లింగాల- 2, వేంపల్లెలో ఒకటి టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ALSO READ: ఊరికి మొనగాడు ఎవరు? ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, మధ్యాహ్నం తర్వాత ఫలితాలు

వైసీపీ కేలం 13 ఏకగ్రీవంగా గెలుచుకుంది. అందులో లింగాలలో వైసీపీ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తాతిరెడ్డిపల్లె, కోమన్నుతల, ఇప్పట్ల, వెలిదండ్ల పంచాయతీలపై పట్టు సడల్లేదు. తొండూరులో నాలుగు, వేములలో రెండు, పులివెందుల మండలం, వేంపల్లె, చెక్రాయపేట పంచాయితీల్లో ఒకొక్కటి చొప్పున గెలుచుకుంది. వైసీపీ ఏకగ్రీవాల కంటే.. కూటమి మూడు రెట్లకు పైగా ఏకగ్రీవాలు చేసుకుందని ఆ మండలం నాయకులు చెబుతున్నారు. చాలా చోట్ల టీడీపీ-జనసేన మధ్య పోటీ ప్రస్తుతం జరుగుతోందట.

Related News

ఊరికి మొనగాడు ఎవరు? ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, మధ్యాహ్నం తర్వాత ఫలితాలు

తుపాన్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. స్పాట్‌లో నలుగురు మృతి, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్: సీఎం చంద్రబాబు

జగనే కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు.. వైసీపీ నేతలు తెలుసుకోవాలి: విజయసాయిరెడ్డి

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఓటర్లకు ఈసారి ఆ వేలుపై సిరా గుర్తు.. ఎస్ఈసీ కీలక ఆదేశాలు!

బ్యాలెట్‌పై నోటా ఉన్నప్పుడు ఏకగ్రీవం ఎలా సాధ్యం? ఏపీ హైకోర్టు సంచలన ప్రశ్న!

ఇసుక మాఫియా ఆగడాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఉపేక్షించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×