E-Paper
Advertisement

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Balmoor Venkat: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన మహిళల అండాల అక్రమ విక్రయం ,హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉందని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.దేశంలోనే అత్యధికంగా మహిళల అండాలను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సద్గురు హెల్త్ కేర్ సర్వీస్’ సంస్థలో ప్రధాన నిందితుడైన వెంకట సూర్య కిరణ్ గేదెల, కేటీఆర్‌కు బాల్య మిత్రుడని బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు. గతంలో కేటీఆర్ స్వయంగా అతడిని తన స్నేహితుడిగా సోషల్ మీడియాలో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. సద్గురు హెల్త్ కేర్ సర్వీస్ , దాని అనుబంధ సంస్థల్లో కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్‌గా, షేర్ హోల్డర్‌గా ఉన్నారని వెంకట్ ఆరోపించారు.

కేటీఆర్ లీగల్ టీమ్ ప్రయత్నం..

Advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుల్తాన్‌పూర్‌లో ఈ సంస్థకు భూములు కూడా కేటాయించారని ఆయన విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుండి మహిళలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి, డబ్బు ఆశ చూపి ఈ దందా నడిపించారని, దీనిపై ఇటీవల హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని వెంకట్ తెలిపారు. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించిందని, ప్రస్తుతం నిందితుడిని బయటకు తీసుకురావడానికి కేటీఆర్ లీగల్ టీమ్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

కేటీఆర్‌కు సవాల్ …శైలిమకు సూచన

Advertisement

మహిళల అండాలతో వ్యాపారం చేయడం సభ్య సమాజం తలదించుకునే ఘటన అని, దీనివల్ల దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని బల్మూర్ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ తక్షణమే స్పందించి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే, వ్యాపార లావాదేవీలు, సంతకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సతీమణి శైలిమకు ఆయన సూచించారు.

Also Read: లైక్‌లు, పబ్లిసిటీ కోసం రోడ్లపైకి రాలేదు.. దీని వెనుక అసలు లక్ష్యం ఇదే: కిషన్ రెడ్డి

Tags

Related News

లైక్‌లు, పబ్లిసిటీ కోసం రోడ్లపైకి రాలేదు.. దీని వెనుక అసలు లక్ష్యం ఇదే: కిషన్ రెడ్డి

కుమార్తె ప్రేమ వ్యవహారం.. ఆగ్రహాంతో రగిలిపోయిన తండ్రి, ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

పౌల్ట్రీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో కీలక ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

పల్నాడు ప్రాజెక్టుపై మౌనం ఎందుకు?.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

ఎల్‌నినో ఎఫెక్ట్.. 15 నెలల సన్నబియ్యం బఫర్ స్టాక్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ వేలంలో కీలక మలుపు.. హైకోర్టు మెట్లు ఎక్కిన వివాదం!

వేల ఎకరాలు అమ్ముకున్న మీరా.. ఇప్పుడు మాట్లాడేది? బీఆర్ఎస్‌పై అద్దంకి ఫైర్

Big Stories

Advertisement
×