BigTV English

TTD: టీటీడీ ఈవోగా శ్యామలరావు నియామకం

TTD: టీటీడీ ఈవోగా శ్యామలరావు నియామకం

TTD EO: TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో శ్యామలరావును నియమించింది. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు.. శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


Also Read: టీచర్ టూ హోం మినిస్టర్.. వంగలపూడి అనిత ప్రస్థానమిదే..

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమయ్యిందని, ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడుతామని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా ఉండేలా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విధితమే. ఇక ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి జే శ్యామలరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


Tags

Related News

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

Big Stories

×