BigTV English

Vangalapudi Anitha: టీచర్ టూ హోం మినిస్టర్.. వంగలపూడి అనిత ప్రస్థానమిదే..

Vangalapudi Anitha: టీచర్ టూ హోం మినిస్టర్.. వంగలపూడి అనిత ప్రస్థానమిదే..

AP Home Minister Vangalapudi Anitha: వంగలపూడి అనిత.. ఇప్పుడీ పేరు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అనిత ఇప్పుడు హోం మినిస్టర్‌. మొదటిసారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అనిత ఏకంగా కుంభస్థలాన్నే కొట్టారంటున్నారు ఏపీ ప్రజలు.


వంగలపూడి అనిత అటు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఎప్పుడు వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అనిత తనదైన శైలిలో జగన్‌పై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఏ కష్టం వచ్చినా తోడుగా నేనున్నా అంటూ మీడియా ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో ఆటాడుకునేవారు. అందుకే ఆమె కష్టాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హోం మంత్రి పదవిని కట్టబెట్టారంటున్నాయి టీడీపీ శ్రేణులు.

వంగలపూడి అనిత ప్రస్థానం

వంగలపూడి అనిత 1984 జనవరి 1వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఎంఈడీ పట్టా పొంది టీచర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం 2014లో అనిత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆవిడకు ఆ పార్టీ బాస్ చంద్రబాబు నాయుడు పాయకరావుపేట(ఎస్సీ రిజర్వడ్) బీ ఫామ్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో అనిత తన సమీప వైసీపీ అభ్యర్థి చంగల వెంకట రావుపై 2828 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తొలి ప్రభుత్వంలో ఆవిడకు మంత్రి పదవి దక్కకున్నా ప్రభుత్వ పరిపాలనలో  క్రియశీలక పాత్ర పోషించారు.


2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనిత వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవ్వడంతో అనిత నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తుండేవారు. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట అసెంబ్లీ బరిలో నిలిచిన ఆవిడ సమీప వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43,727 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Also Read: ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. పవన్ చేతికి కీలక శాఖలు

ఎన్డీయే కూటమి ఏర్పడగానే చంద్రబాబు నాయుడు అనితకు గుడ్ న్యూస్ చెప్పారు. మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నామని బాబు చెప్పడంతో అనిత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారామె. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అనిత మదిలో మాత్రం టెన్షన్. తనకు ఏ శాఖ కేటాయిస్తారోనని. కానీ చంద్రబాబు నాయుడు అనితకు హోం మంత్రిత్వ శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో టీచర్ అనిత ఇప్పడు హోం మినిస్టర్ అయ్యారు.

Tags

Related News

Women Health Camps: సెప్టెంబ‌ర్ 18 నుంచి.. మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు..!

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కొత్త మలుపు.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, వైసీపీలో గుబులు

Temple Stampedes: ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు.. ఆ ఎస్పీని టార్గెట్ చేసుకున్న వైసీపి.. ప్రభుత్వం ఘాటు రిప్లై!

AP Mega DSC 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. నియామక పత్రాల పంపిణీ వాయిదా

AP Assembly: అసెంబ్లీ సమావేశాలు.. మండలిలో యూరియా సెగ, పలుమార్లు సభ వాయిదా

AP Railways: ఏపీలో కొత్తగా 11 రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులు, ఆ శాఖ గ్రీన్ సిగ్నల్

Amaravati News: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు‌పై ఉత్కంఠ, సాయంత్రం నిర్ణయం?

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Big Stories

×