BigTV English

Slab Collapsed: ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు!

Slab Collapsed: ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు!

Slab Collapsed in Nandyal District(AP news today telugu): నంద్యాల జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రోదనలు మిన్నంటాయి. చాగలమర్రి మండలంలోని చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలడంతో నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


భార్యభర్తలు గురుశేఖర్ రెడ్డి(45), దస్తగిరమ్మ(38), ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10) రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలింది. ఉదయం స్థానికులు చూసే సరికి ఇల్లు కూలింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Also Read: జగన్ పరిస్థితి ఏంటి, వెంకట్‌రెడ్డి ఎక్కడ? రంగంలోకి ఏసీబీ..


శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులు వెలికితీశారు. అయితే వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నట్లు గ్రామస్తుల తెలిపారు. కుటుంబంలో ఒకేసారి నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా, ఇటీవల కురిసన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచి, శిథిలావస్థకు చేరి కూలినట్లు తెలుస్తోంది.

Related News

APSRTC bus fight: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఘర్షణ.. సీటు కోసం బూతు దాకా వెళ్లిన వాగ్వాదం.. వీడియో వైరల్!

Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యకు కుట్ర

Vizag tourism: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లో టికెట్ ధర తగ్గింపు.. జర్నీకి సిద్ధమా!

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్

Vizag: ఏపీకి గూడ్‌న్యూస్.. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే

Big Stories

×