BigTV English

NEET Exam paper leak chargesheet: నీట్ కేసు.. తొలి ఛార్జిషీట్‌లో 13 మంది.. కాకపోతే..

NEET Exam paper leak chargesheet: నీట్ కేసు.. తొలి ఛార్జిషీట్‌లో 13 మంది.. కాకపోతే..

NEET Exam paper leak chargesheet: నీట్ పేపర్ లీక్ విచారణ జోరుగా సాగుతుందని చెప్పడానికి సీబీఐ తొలి అడుగువేసింది. ఈ కేసులో తొలి ఛార్జిషీటును దాఖలు చేసింది. 13 మంది నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ, కీలక సూత్రధారి ఎవరన్నది మాత్రం ప్రస్తావించలేదు. నిందితులంతా పేపర్ లీక్ సహా ఇతర అక్రమాలకు పాల్పడ్డారని ప్రస్తావించింది. అయితే విచారణ ఇంకా దర్యాప్తు జరుగుతోందని చెప్పే ప్రయత్నంచేసింది.


నీట్-యూజీలో అక్రమాలు, పేపర్ లీకేజ్‌కి సంబంధించి మొత్తం ఆరు ఎఫ్ఐఆర్‌లను నమోదయ్యాయి. వీటిలో బీహార్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది సీబీఐ. ఈ కేసులో 58 ప్రాంతాల్లో సోదాలు చేసింది సీబీఐ. మొత్తం 40మంది నిందితులను అరెస్ట్ చేసింది. 13మంది వ్యక్తుల్లో ఎక్కువమంది బీహార్‌కు చెందినవారుగా తెలుస్తోంది.

వారిలో నితీష్‌కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వేందు, అశుతోషు‌కుమార్, రోషన్‌కుమార్, అఖిలేష్ కుమార్, అవదేషుకుమార్, అనురాగ్‌యాదవ్, అభిషేక్‌కుమార్, శివానందన్‌కుమార్, అయూష్‌రాజ్ లున్నారు. ఈ కేసులో 58 ప్రాంతాల్లో సోదాలు చేసింది సీబీఐ. జార్ఖండ్, బీహార్‌ల్లో నీట్ పేపర్ లీకైందన్న దానిపై జోరుగా దర్యాప్తు చేస్తోంది. దీని ద్వారా దాదాపు 155 మంది లబ్ది పొందారని వార్తలు వస్తున్నాయి.


ALSO READ: చార్ ధామ్ యాత్రికులకు బ్యాడ్ న్యూస్..ప్రయాణాలు వాయిదా వేసుకోండి

ఈ ఏడాది మే ఐదున దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష జరిగింది. 571 నగరాల్లో 4,700 సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది. దీనికోసం సుమారు 23లక్షల మంది హాజరయ్యారు. అయితే ఒకే సెంటర్‌లోని విద్యార్థులకు ర్యాంకులు వచ్చాయి. దీనిపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు రావడంతో
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చీఫ్ తప్పుకున్నారు. ఈలోగా వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి గమనించిన మోదీ సర్కార్, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అటు విద్యార్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. నీట్ పరీక్ష మళ్లీ జరపాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది. అక్రమాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం తెల్సిందే.

Related News

NIRF Rankings 2025: NIRF ర్యాం‘కింగ్‌’లో ఐఐటీ చెన్నై.. ఐఐఎం అహ్మదాబాద్, తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలెక్కడ?

Delhi: పొంగిన యమునా నది.. ఫ్లైఓవర్ మధ్య భారీ హోల్, ఆటోకు తప్పిన ప్రమాదం

Scholarship scheme: అదిరిపోయే స్కీమ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి రూ.20వేలు పొందొచ్చు..

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

Big Stories

×