BigTV English

SPF Constable Suicide in Vizag: విశాఖలో దారుణం.. డ్యూటీలో కానిస్టేబుల్.. ఆపై సూసైడ్..!

SPF Constable Suicide in Vizag: విశాఖలో దారుణం.. డ్యూటీలో కానిస్టేబుల్.. ఆపై సూసైడ్..!

SPF Constable Suicide in Vizag: విశాఖ సిటీలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న ఎప్‌పీఎఫ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ద్వారకానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐవోబీ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు శంకర్రావు.


గురువారం ఉదయం ఐదుగంటలకు డ్యూటీకి హాజరయ్యాడు. మరి ఏమైందో గానీ గన్ శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్లు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా ఈ విషయం పోలీసు అధికారులకు తెలిసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు అధికారులు. తన దగ్గరున్న గన్‌తో కాల్చుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

శంకర్రావు డీటేల్స్‌ను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కానిస్టేబుల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలోపడ్డారు పోలీసులు. ఆయన సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.


Also Read: TDP Rebels : టిడిపికి రెబల్స్ కష్టాలు.. బుజ్జగింపులు ఫలిస్తాయా ?

శంకర్రావుకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఫ్యామిలీ సమస్యలు కారణమా? అనే కోణం దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పోలీసులు డ్యూటీలో చనిపోయిన సందర్భాలు లేకపోలేదు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×