EPAPER

Srisailam Devotees Rush : భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం ఆలయం.. ముక్కంటి దర్శనానికి నాలుగు గంటలు

Srisailam Devotees Rush : భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం ఆలయం.. ముక్కంటి దర్శనానికి నాలుగు గంటలు

Srisailam Devotees Rush : శ్రీగిరి మల్లన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ముక్కంటీశుని దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచుకుంటున్నారు. శ్రీశైలంలో కార్తీకమాసం పౌర్ణమి, రెండో సోమవారం కూడా కలసి రావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.


ముక్కంటీశుని ఆలయం ముందు భాగంలో గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది, సోమ వారాల్లో, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు.

మరోవైపు అలంకార దర్శనం ఏర్పాటుతో త్వరగతిన దర్శనాలు పూర్తవుతున్నాయి. అలానే నేటి సాయంత్రం కార్తీక పౌర్ణమి రెండో సోమవారం సందర్భంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కృష్ణమ్మకు నది హారతి వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.


Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×