Big Stories

Chandrababu: విశాఖను వాణిజ్య రాజధాని చేస్తాం.. ఉత్తరాంధ్రులకు చంద్రబాబు కీలక హామీ

Chandrababu: ఉత్తరాంధ్రను ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ప్రజల ఆస్తులను జగన్ బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

విజయనగరం జిల్లాలోని రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ హయంలో చేపట్టిన పనులు ఉత్తరాంధ్రలో కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చంద్రబాబు అన్నారు.

- Advertisement -

టీడీపీ చేపట్టిన పనులను వైసీపీ పక్కన పెట్టేసి.. విశాఖను గంజాయి, డ్రగ్స్ రాజధానిగా మార్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను వాణిజ్య రాజధానిని చేస్తామని ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మాటిచ్చారు.

గతంలో తమ ప్రభుత్వం ఎంతో కష్టపడి మెడ్ టెక్ పార్కులు, అదానీ డేటా సెంటర్, లులు మాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తీసుకువస్తే.. వైసీపీ వాటన్నింటినీ తరిమి కొట్టిందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.

కూటమి అధికారంలోకి వస్తే 25 వేల కానిస్టేబులు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు యువతకు హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.25 వేలు అందిస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News