BigTV English

Ambati Rambabu: ర్యాంకులపై అంబటి ట్వీట్.. పోలవరం కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్

Ambati Rambabu: ర్యాంకులపై అంబటి ట్వీట్.. పోలవరం కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్

Ambati Rambabu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఊహించని నేత నుండి అభినందనలు వ్యక్తమయ్యాయి. పవన్, లోకేష్ లక్ష్యంగా విమర్శలు చేసే ఆ నేత, తన ట్వీట్ ద్వార అభినందనలు తెలిపారు. అయితే ఆ నేత సెటైరికల్ గా అభినందనలు తెలపడంతో, టీడీపీ కి చెందిన పలువురు అదే స్థాయిలో ఆ నేతకు రిప్లై ఇస్తున్నారు. ఆయనెవరో కాదు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు.


ఏపీలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ప్రతి విషయంపై విమర్శించే వారిలో అంబటి రాంబాబు మొదటి వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఎందరో నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ, అంబటి రాంబాబు మాత్రం తన అడుగులు జగన్ వెంటే అంటూ.. కూటమిపై ఘాటు విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సమయంలో కూడా.. అంబటి రాంబాబు తన ట్వీట్లతో రాజకీయ దుమారం లేపారని చెప్పవచ్చు. అంతేకాదు వైసీపీకి చెందిన సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను అరెస్ట్ చేస్తున్న క్రమంలో, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు టీడీపీ నేతలపై అంబటి ఫిర్యాదు చేశారు. ఇలా ఏదొక రూపంలో అంబటి నిరంతరం వార్తలో నిలుస్తున్నారు.

తాజాగా మరో సెటైరికల్ ట్వీట్ తో అంబటి రాంబాబు హల్చల్ చేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు తన కేబినెట్ పరిధిలోని మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ర్యాంకులలో నారా లోకేష్ 8వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 9వ స్థానంలో నిలిచారు. ఈ ర్యాంకులు ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రకటించగా.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ ట్వీట్ చేశారు.


మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అంబటి చేసిన ఈ ట్వీట్ పై టీడీపీ కి చెందిన నెటిజన్లు అదే స్థాయిలో అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం అంబటికి తగదంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. పోలవరం ప్రాజెక్టు అర్థం కావడం లేదంటూ ప్రకటించిన మీకు ఏ ర్యాంక్ ఇవ్వాలని విమర్శలు గుప్పిస్తున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×