Thandel: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. నిజంగా జరిగిన సంఘటనతో కాస్త ఫిక్షన్‌ను యాడ్ చేస్తే సరి.. సినిమా సూపర్ హిట్ అని మేకర్స్ నమ్ముతారు. అలాగే కొందరు మత్స్యకారుల జీవితంలో నిజమైన సంఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే ‘తండేల్’. నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ సినిమా ఏంటి, దీని కథ ఏంటి అని ముందుగానే రివీల్ చేశారు మేకర్స్. అందుకే ఇందులో ఒక అంశంపై వారంతా భారీగా అంచనాలు పెంచేసుకున్నారు. తీరా చూస్తే.. స్క్రీన్ పై అసలు ఆ అంశాన్ని అంత బలంగా చూపించలేకపోయాడు దర్శకుడు.
అంచనాలు పెంచేసుకున్నారు
శ్రీకాకుళానికి చెందిన కొందరు మత్స్యకారులు తెలియకుండా పాకిస్థాన్ బోర్డర్ దాటేస్తే అక్కడ వారికి ఎదురైన కష్టాలు ఏంటి అని చెప్పడమే ‘తండేల్’ (Thandel) కథ. ఈ సినిమాలో ముఖ్యమైన అంశమే పాకిస్థాన్‌లోకి వెళ్లడం. అక్కడికి వెళ్లి ఇరుక్కుపోయిన మత్స్యకారుల్లో ఒకడిగా నాగచైతన్య నటించాడు. అయితే ఈ మూవీలో పాకిస్థాన్ ఎపిసోడ్స్‌పైనే ప్రేక్షకులంతా అంచనాలు పెంచేసుకున్నాడు. పైగా ఈ మూవీ టీజర్‌లో కూడా చివర్లో మేరా భారత్ మహాన్ అంటూ చైతూ చెప్పే డైలాగ్ చూసిన తర్వాత పాకిస్థాన్‌లో వచ్చే సీన్స్‌కే సినిమాకు హైలెట్ అనుకున్నారంతా. కానీ అంత అంచనాలు పెంచేసుకొని తెరపై వాటిని చూడగానే ప్రేక్షకులు చాలావరకు డిసప్పాయింట్ అయ్యారు.
సరిగ్గా వాడుకోలేదు
‘తండేల్’లో పాకిస్థాన్ ఎపిసోడ్స్ హైలెట్ అవుతాయని అనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. అందులో నాగచైతన్య యాక్టింగ్ మరో లెవెల్‌లో ఉంటుంది, పాకిస్థాన్ జైలులో వచ్చే సీన్స్ అన్నీ థ్రిల్లింగ్‌గా ఉంటాయని అనుకున్నారంతా. కానీ ప్రేక్షకులు భారీగా పెంచేసుకున్న అంచనాలను దర్శకుడు చందు మోండేటి అందుకోలేకపోయాడు. అసలైతే ఈ పాకిస్థాన్ ఎపిసోడ్‌ను దర్శకుడు మరింతగా వాడుకోవచ్చు, దీనిని మరింత ఎమోషనల్‌గా, థ్రిల్లింగ్ తెరకెక్కించి ఉండవచ్చు. కానీ ఎక్కడో ఈ విషయంలో డైరెక్టర్ విఫలం అయ్యాడనే ఫీలింగ్ చాలామంది ప్రేక్షకుల్లో కలుగుతుంది. స్కోప్ ఉన్నా కూడా పాకిస్థాన్ ఎపిసోడ్‌ను వాడుకోలేకపోయాడు చందు.
Also Read: వైరల్ గా మారిన సాయి పల్లవి అలవాట్లు.. అలా ఉంటేనే ఇష్టమంటూ..?
యాక్టింగే హైలెట్
చందు మోండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రమే ‘తండేల్’. ఒక మామూలు కథతో మొదలయిన ఈ సినిమా.. మత్స్యకారుల జీవితంలో నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నారు. అందుకే దాదాపు ఆరు నెలల పాటు ‘తండేల్’ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ జరిగింది. మూవీ టీమ్ అంతా స్వయంగా వెళ్లి పాకిస్థాన్‌లో ఇబ్బందులు ఎదుర్కున్న మత్స్యకారులను కలిశారు. వారితో మాట్లాడారు. వారి గురించి మరింత తెలుసుకున్నారు. అలా నాగచైతన్య, సాయి పల్లవి పూర్తిగా తమ పాత్రల్లో లీనమయిపోయారు. శుక్రవారం విడుదలయిన ‘తండేల్’కు చాలావరకు పాజిటివ్ రివ్యూలే లభిస్తున్నాయి.