BigTV English

Rushikonda Constructions : రుషికొండ నిర్మాణాలపై సుప్రీంలో విచారణ.. పిటిషన్ డిస్ మిస్

Rushikonda Constructions : రుషికొండ నిర్మాణాలపై సుప్రీంలో విచారణ.. పిటిషన్ డిస్ మిస్

Rushikonda Constructions : రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై లింగమనేని శివరామ్ ప్రసాద్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం శుక్రవారం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేసింది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో రిట్ దాఖలు కాగా, ఈ అంశంలో తమ జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఇది రాజకీయ ఫిర్యాదు అని, ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు.


కాగా.. ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఏపీ ప్రభుత్వ చర్యలు తక్షణమే నిలువరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు లింగమనేని శివరామప్రసాద్‌. NGTతోపాటు హైకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషికొండపై ఎలాంటి నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్‌పై NGTలో విచారణ జరుగుతున్నప్పటికీ.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా..రుషికొండలో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఉల్లంఘించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు శివరామ్‌. రుషికొండలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేసేలా జారీ చేసిన జీవోను రద్దు చేయాలన్నారు. రుషికొండపై రిసార్ట్ నిర్మాణంపై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకూ..నిర్మాణాలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరగా.. ఆయనకు ఊహించని షాక్ తగిలింది.

ఇదిలా ఉండగా.. రుషికొండ నిర్మాణాలపై ఈ నెల 29న హైకోర్టు విచారణ చేపట్టనుంది.
రుషికొండ నిర్మాణాలపై కేసు విచారణ ఈ నెల 29న చేపట్టనుంది హైకోర్టు. న్యాయస్థానం నియమించిన కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. అక్రమంగా తవ్వకాలు, భవనాలు నిర్మించారని కోర్టుకు వెల్లడించింది. అనుమతికి మించి కట్టడాలున్నాయని.. నియామక కమిటీ వెల్లడించింది. మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అటవీ, పర్యావరణశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసు విచారణను 29కి వాయిదా వేసింది హైకోర్టు.


డిసెంబర్ నుంచి తాను విశాఖ నుంచే పరిపాలన కొనసాగించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు సీఎం జగన్. ఈ మేరకు.. క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీని సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రుషికొండపై పర్యాటక శాఖ పేరుతో నిర్మించిన భవనాల్లో సీఎం కార్యాలయం, అలాగే అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో సీఎం నివాసం ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×