Balakrishna host Big boss : టాలీవుడ్ లో ప్రస్తుతం బాలయ్య హవా నడుస్తుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. టీవీ షో అయినా.. థియేటర్ అయినా.. ప్రేక్షకులు జై బాలయ్య అంటూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య కెరియర్ అన్ స్టాపబుల్ అన్నట్లు దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయాలతో క్రేజీ ప్రాజెక్టులతో సినిమా సంబరాలు ఒకవైపు అయితే.. బుల్లితెర అన్ స్టాపబుల్ షో తో బాలయ్య కు పెరిగిన ఫ్యాన్ బేస్ మరొకవైపు. ఇక దీనితో పాటుగా మరొక షో లో కూడా బాలయ్య కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అఖండ అందించిన అఖండమైన విజయం.. నందమూరి నటవారసత్వం.. దేనికి జంకని స్వభావం.. మీమర్లకు సైతం షాక్ ఇచ్చే డైలాగ్స్.. గంభీరమైన పర్సనాలిటీ.. అన్నిటికీ నిలువెత్తు రూపంలా ఉండే నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన అడుగుపెడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది..రికార్డులు బ్రేక్ అవుతాయి.. థియేటర్ దద్దరిల్లుతుంది అన్నట్లు ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈ సీనియర్ హీరో కుర్ర హీరోలకు సైతం సవాలుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాగార్జున,బాలకృష్ణ లాగే ఎప్పటినుంచో బిగ్ బాస్ తెలుగు షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున హోస్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నాగార్జున చేస్తున్న బిగ్ బాస్ షో అతను చేయి జారిపోయేలా ఉంది.
దీనికి కారణం బాలకృష్ణ అన్ స్టాపబుల్ అన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి బాలయ్యకు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో విమర్శించేవారు అంతకంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఎప్పుడైతే బాలయ్య అన్ స్టాపబుల్ షో మొదలు పెట్టాడో క్రమంగా అతనిపై ఉన్న విమర్శలు ప్రశంసలుగా మారడం మొదలయ్యాయి. అప్పటివరకు బాలయ్య నచ్చని వారు కూడా అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ కోసం.. అందులో బాలయ్య పంచ్ మార్క్ డైలాగ్స్ కోసం ఆత్రంగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఊహించని సక్సెస్ అందుకొని సీజన్ మీద సీజన్ చేస్తూ ఈ షో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ఇంత సక్సెస్ అవ్వడానికి మేజర్ రీసన్ బాలయ్యే అన్న విషయం అందరికీ తెలుసు.
కుర్ర హీరోలకి సైతం షాక్ కొట్టే విధంగా అల్లరి చేస్తూ.. సిచువేషన్ డిమాండ్ ను బట్టి పంచ్ డైలాగులు విసురుతూ.. బాలయ్య ఈ షోని అద్భుతంగా హొస్ట్ చేస్తున్నారు. బాలయ్య పర్ఫామెన్స్ కి ఫిదా అయిన ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ,తెలుగులో దీన్ని హోస్ట్ చేయడానికి బాలయ్యను సంప్రదించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదట తెలుగులో ఈ షో
ను జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని.. ఇక మూడవ సీజన్ నుంచి తన హోస్టింగ్ మొదలుపెట్టిన కింగ్ నాగార్జున ప్రజెంట్ సీజన్ వరకు కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రతి సీజన్లో తనదైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉన్నారు. అయితే వరుసగా ఇన్ని సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చూసిన ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అవుతున్నారు. మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో బిగ్ బాస్ షో కి రాను రాను ఆదరణ తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే షో కు బూస్ట్ ఇవ్వడానికి ఈసారి నందమూరి నటసింహాన్ని బరిలోకి దింపాలని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోందట. ఇదే కనుక నిజమైతే బిగ్ బాస్ తెలుగు కాస్త బాలయ్య బిగ్ బాస్ గా మారిపోవడం ఖాయం. అయితే ఈ విషయం పై అధికారికంగా ప్రకటన వస్తేనే ఏ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది.