E-Paper
Advertisement

Tammineni Sitaram: అమరావతిపై తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారో తెలుసా?

Tammineni Sitaram: అమరావతిపై తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారో తెలుసా?
Advertisement

Tammineni Sitaram: ఆంధ్ర‌ప్రదేశ్ రాజకీయాలు రాజధాని అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై వైసీపీకి చెందిన నేతలు రోజుకో విధంగా మాట్లాడుతున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే రాజధాని అమరావతిపై అలజడి రేపి ఆ ప్రాంత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

అమరావతిపై తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు

Advertisement

తమ్మినేని సీతారాం గురించి చెప్పనక్కర్లేదు. ఏపీకి చెందిన మాజీ స్పీకర్. ఆయన స్పీకర్‌గా ఉన్న సమయంలో రాజధాని అమరావతితోపాటు చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ మాటలు టీడీపీ నేతలు, కార్యకర్తలను పదేపదే వెంటాడుతున్నాయి. అది వేరే విషయం. తాజాగా బుధవారం మీడియా ముందుకొచ్చిన ఆయన మరోసారి రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతికి చేస్తున్న ఖర్చును జగన్ తీసుకొచ్చిన ప్లాన్ బి ‘మావిగన్’ను అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడొచ్చన్నారు.  కేవలం 10 శాతం ఖర్చు చేస్తే మావిగన్ నెంబర్ వన్ రాజధాని అవుతుందన్నారు. ఆ మాత్రం ఆలోచన చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అసలే అప్పుల్లో కూరుకుపోయిన ఏపీపై రాజధాని పేరిట మరింత భారం మోపుతున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

మావిగన్‌కు కేవలం 10 శాతం నిధులు ఖర్చు చేస్తే.. ప్రపంచంతో పోటీపడొచ్చు

ప్రతిపక్ష పార్టీగా రాజధాని విషయంలో తాము సలహా ఇచ్చామన్నారు. ఈ విషయాన్ని పక్కనబెట్టి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ రెండేళ్లు సాగదీశారన్నారు. ఇప్పుడున్న అప్పులకు తోడు ఇదొకటా? అని వ్యాఖ్యానించారు. ఇంకా అప్పులు ఎంత తెస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మావిగన్‌పై ప్రజలు మేధావులు, విద్యార్థులు ఆలోచించి ఎంపిక చేసుకోవాలని సూచన చేశారు.

గతంలో అంటే.. 2019 డిసెంబర్ 21న రాజధాని అమరావతిపై తమ్మినేని సీతారాం ఏమన్నారు? అమరావతికి వెళ్తుంటే ఎడారికి వెళ్లినట్టు ఉంటుందన్నారు. మిగిలినవారు ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అందరూ గర్వించేలా రాజధాని ఉండాలని, ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన ఉండాలన్నారు.

ALSO READ: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. మావిగన్ చూట్టూ ఏపీ రాజకీయాలు, అందుకే ఈ ప్లాన్

అమరావతిలో ఆ పరిస్థితి కనిపించలేదన్నారు.  అందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించినట్టు చెప్పిన విషయం తెలిసిందే.  అప్పుడు మూడు రాజధానులు అని వైసీపీ నేతలు అన్నారు. ఇప్పుడు మావిగన్ పాట పాడుతున్నారు. మొత్తానికి అధినేత బాటలో నేతలంతా పయనిస్తున్నారు.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×