Amaravati: ఏపీలో రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయా? సరైన అస్త్రాల కోసం వైసీపీ వెయిట్ చేస్తోందా? ‘మావిగన్’ రూపంలో భారీ అస్త్రం ఆ పార్టీకి దొరికిందా? ఎందుకు దాన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది? దీని వెనుక స్కెచ్ ఏంటి? వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.
మావిగన్ చూట్టూ ఏపీ రాజకీయాలు.. జగన్ స్కెచ్ మామూలుగా లేదు
మావిగన్ రూపంలో వైసీపీకి సరైన అస్త్రం లభించింది. గడిచిన రెండేళ్లు ఆ పార్టీ నేతలు బయటకు వచ్చి పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. ఏ విషయాలు మాట్లాడినా అధికార పక్షం నుంచి వెంటనే కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. దీన్ని నుంచి బయటకు రాలేక రెండేళ్లు తర్జనభర్జన పడ్డారు. అధినేత జగన్ ఎక్కుపెట్టిన మావిగన్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ డిసైడ్ అయినట్టు సమాచారం.
ఇందుకు కారణాలు లేకపోలేదు. ఏపీ రాజధాని అమరావతి కావడంతో క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికి పోతుంది. దీనివల్ల ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో పెద్ద మైనస్.దీన్ని అధిగమించేందుకు జగన్ ఎక్కుపెట్టిన అస్త్రం ‘మావిగన్’. ఆ పేరులో మూడు ప్రాంతాలు కలిసి ఉండడంతో కచ్చితంగా రానున్న రోజుల్లో తమకు అనుకూలంగా మారవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తాడేపల్లి జగన్ ప్యాలెస్ చుట్టూ ‘మావిగన్’ బ్యానర్లు
అందుకోసం మావిగన్ గురించి ఎడతెగని ప్రచారం చేస్తోంది వైసీపీ. గడిచిన వారం రోజులుగా ఆ పార్టీ నేతలు మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి మావిగన్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కేవలం మీడియా ముందు నేతలు మాట్లాడితే సరిపోదని, దీనిపై ఊరూవాడా జోరుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది వైసీపీ.
ఈ నేపథ్యంలో తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ చుట్టూ తాటికాయంత అక్షరాలతో ‘మావిగన్’ బ్యానర్లు వెలిశాయి. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలని జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఈ తరహా బ్యానర్లు సిద్ధం చేయాలని హైకమాండ్ నుంచి ఆ పార్టీ నేతలకు సంకేతాలు వెళ్లినట్టు చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైంది.
ALSO READ: ఏపీలో వింత వాతావరణం.. ఒకచోట భానుడి భగభగలు.. మరోచోట వరుణుడి పలకరింపు!
తాము అమరావతికి వ్యతిరేకం కానదన్నది వైసీపీ ఆలోచన. ఆ రెండు జిల్లాల్లో పార్టీ పదిలంగానే ఉంటుందని ఓ అంచనా. అందుకోసం ఈ స్కెచ్ వేసినట్టు ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 2029 ఎన్నికల్లో కాకపోయినా 2034 ఎన్నికల్లో తప్పకుండా విజయం తమదేనని మాట్లాడుకుంటున్నారు.
దీనివల్ల జగన్ ఆలోచనను మద్దతు ఇచ్చినట్టు అవుతుందని, అమరావతి రైతుల్లో కొత్త ఆందోళన ఉంటుందని అంటున్నారు. అంతేకాదు అమరాతికి పెట్టుబడులు కూడా రావన్నది కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను జగన్ కొట్టడం వెనుక వ్యూహం ఇదేనని అంటున్నారు.
తాడేపల్లిలో జగన్ 2.0 మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు కలకలం
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు
తాడేపల్లిలో వన్ పార్టీ, వన్ ఫ్లాగ్, వన్ అజెండా… మావిగన్ 2029 పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైసీపీ నేత శివాజీ
"Jagan 2.0: Mavigan" Flex Banners and Hoardings… https://t.co/PveNCV2NWM pic.twitter.com/137w01bBvV
— BIG TV Breaking News (@bigtvtelugu) April 9, 2026