BigTV English

Lokesh-Brahmani Tweets : “కాంతితో క్రాంతి”.. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం

Lokesh-Brahmani Tweets : “కాంతితో క్రాంతి”.. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం

Lokesh-Brahmani Tweets : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు సంఘీభావంగా.. టీడీపీ మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నెల 7వ తేదీ శనివారం “కాంతితో క్రాంతి” పేరిట కార్యక్రమం చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలపాలని లోకేష్ పిలుపునిచ్చారు. అలాగే “బాబుతో నేను” అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.


చంద్రబాబు అనే వెలుగుని నిర్బంధించి ఇక తమకు తిరుగులేదని కొందరు అపోహలో ఉన్నారని, కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందన్న విషయం వారికి ఇంకా తెలియలేదని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. “మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి… దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు.కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం అని బ్రాహ్మణి ట్వీట్ చేశారు.


https://x.com/brahmaninara/status/1710178446029258832?s=20

https://x.com/naralokesh/status/1710173306186314109?s=20

Related News

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Big Stories

×