
Shubman Gill : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లు గురువారం నాడు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆరంభ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ గత వరల్డ్ కప్ ప్రతీకారాన్ని తీర్చుకొని ఇంగ్లాండ్ జట్టుపై ఘనవిజయాన్ని నమోదు చేసింది. ఇక వరల్డ్ కప్ 2023 కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు కూడా రేపు ఎనిమిదవ తారీఖున ఈ టోర్నమెంట్ కు సంబంధించిన తొలి మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కీ ప్లేయర్ జట్టుకు దూరం కావడం కాస్త గందరగోళాన్ని సృష్టిస్తుంది.
టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభ్ మన్ గిల్ అనారోగ్య సమస్య కారణంగా రేపు 8 న జరగబోయే మ్యాచ్ లో పాల్గొనలేక పోతున్నాడు. తొలి మ్యాచ్ కు ముందే ఇది టీం ఇండియాకు పెద్ద షాక్ అని చెప్పాలి. టీంలో కీలక ఆటగాడు అయిన గిల్ మ్యాచ్ కి దూరం కావడం అంటే…ఆలోచించాల్సిన విషయమే కదా. ప్రస్తుతం ఉన్న టీం ఇండియా ప్లేయర్స్ లో భీకరమైన ఫామ్ లో ఉన్న ఆటగాడు గిల్…మరి ఈ నేపథ్యంలో టీం ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి.
డెంగీ పాజిటివ్ రావడంతో గిల్ తొలి మ్యాచ్ ఆడ లేకపోవచ్చు. అయితే ఆ తర్వాత జరిగే మ్యాచ్ లలో కూడా అతను పాల్గొంటాడా లేదా అనేది కాస్త సందేహమే. అయితే ప్రస్తుతం గిల్ దూరమయ్యాడు అనేకంటే కూడా అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది మిలియన్ డాలర్ క్యూస్షన్ గా మారింది. జరగబోయే తొలి మ్యాచ్ కావడంతో …టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం. మరి ఓపెనర్ ఘనంగా ఆరంభిస్తేనే కదా స్కోర్ ముందుకు సాగేది. ఓపెనింగ్ ఇరగదీస్తాడు అనుకున్న గిల్లు డెంగీ బారిన పడడం కాస్త బాధాకరమైన విషయమే.
8వ తారీఖున జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా తో తలపడనుంది. మోస్ట్ కాంప్లికేటెడ్ మ్యాచ్ లో ఇప్పుడు రోహిత్ తో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యం ఎవరు చేయాలి అనేది పెద్ద భేతాల ప్రశ్న. దూకుడుగా ఆడి గట్టెక్కిస్తాడు అనుకున్న గిల్ డీల పడిపోయాడు. ఇక ఒకళ్ళిద్దరూ స్టార్ బ్యాట్స్ మెన్స్ ఉన్నా…వాళ్లు గాయాల కారణంగా ఇప్పటికే మ్యాచ్ కి దూరంగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో గిల్ కూడా అస్వస్థతకు గురి కావడం తో…అతను స్థానంలో ఇషాన్ కిషన్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతానికి గిల్ జ్వరంతో బాధపడుతున్నట్టు మాత్రమే తెలుసు కానీ అతనికి డెంగీ అనే విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.
గత కొద్ది కాలంగా జరుగుతున్న మ్యాచ్ లను గమనిస్తే… రోహిత్ సేన అడపాదడపా తడబడుతూనే ఉంది. అసలే కీలకమైన మ్యాచ్…ఇలాంటి సమయంలో ఈ ట్విస్టు ఏంటిరా బాబు అంటున్నారు క్రికెట్ అభిమానులు. మ్యాచ్ కి గట్టిగా రెండు రోజుల సమయం ఉంది. అయితే ఈ రెండు రోజుల్లో గిల్ కోల్కొని మ్యాచ్ లో పాత ఫామ్ లో పర్ఫార్మ్ చేస్తాడు ..అంటే అది ఒక నమ్మశక్యం కాని మిరాకిల్ కిందే లెక్క. మరోపక్క చెన్నైలో జరగనున్న తొలి టీమిండియా మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం గిల్ పరిస్థితి కేవలం టీం ఇండియానే కాదు టోటల్ ఇండియా ని కన్ఫ్యూషన్ లో పడేసింది.
Rohit Sena, Shubman Gill, Team India opener ,
ICC World Cup