BigTV English

TDP: కుప్పకూలిన డయాస్.. కిందపడిన టీడీపీ టాప్ లీడర్స్..

TDP: కుప్పకూలిన డయాస్.. కిందపడిన టీడీపీ టాప్ లీడర్స్..
tdp collapse

TDP latest news telugu(Breaking news in Andhra Pradesh): ఏలూరు జిల్లాలో టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరుగుతోంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో ఏర్పాటు చేసిన సభకు ప్రముఖ నాయకులే హాజరయ్యారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు విచ్చేశారు. భారీ వేదికపై పలువురు సీనియర్ నాయకులు ఆసీనులయ్యారు.


వేడికపై చినరాజప్ప మాట్లాడుతున్నారు. వాతావరణం చల్లగా ఉంది. హోరన గాలి వీస్తోంది. జోరుగా ప్రసంగం సాగుతోంది. అంతలోనే అనుకోని ప్రమాదం. గాలి తీవ్రతకో, బరువుకో.. తెలీదు కానీ.. టీడీపీ సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వేదికపై పదుల సంఖ్యలో ఉన్న నాయకులు కుప్పకూలిపోయారు.

కళ్లముందే డయాస్ కూలిపోవడంతో.. సభకు హాజరైన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్క ఉదుటున ముందుకొచ్చారు. పడిపోయిన నాయకులను పైకి లేపారు. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.


ప్రమాదం విషయం తెలిసి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. గాయపడిన టీడీపీ నేతలను ఫోన్లో పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×