Jagan Palnadu Tour: వైసీపీ వేసే అడుగులు.. చేసిన పనులు కూటమి జాగ్రత్తగా గమనిస్తోందా? ఈ మధ్యకాలంలో జగన్ టూర్ల వెనుక అసలు కారణమేంటి? ఏపీలో శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసే పనిలోపడ్డారా? అందుకోసమే పోలీసులు ఆంక్షలు పెట్టారా? అయినా పార్టీ నేత చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్పు దేనికి? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను సైతం వెంటాడుతున్నాయి.
కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నెగిటివ్‌గా మార్చి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నేత చనిపోయి ఏడాది తర్వాత పల్నాడు ఎందుకు వెళ్తున్నారు? టూర్ ముసుగులో ఏదైనా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రచారానికి తెరలేపుతున్నట్లు కనిపిస్తోందని టీడీపీ పదేపదే ఎందుకు అంటోంది?
జగన్ పల్నాడు టూర్ గురించి టీడీపీ కీలక విషయాలు బయటపెట్టింది. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరుతారు. అక్కడి నుంచి తన వాహనంలో నేరుగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకి చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల వైస్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇంతవరకు షెడ్యూల్ బాగానే ఉంది.
ఇంతకీ నాగమల్లేశ్వరరావు ఎవరు? ఎప్పుడు చనిపోయాడు? దీనివెనుక అసలు కారణం ఎవరు అనే విషయాలను బయటపెట్టింది టీడీపీ. నాగమల్లేశ్వరావు బెట్టింగ్‌కు బలయ్యాడన్నది టీడీపీ చెబుతున్న మాట. దీనివెనుక మాజీ మంత్రి, ఆ పార్టీ నేత అనిల్‌కుమార్ ఉన్నారని అంటోంది.
ALSO READ: లిక్కర్ స్కామ్‌లో డొంక కదిలింది.. చెవిరెడ్డి అరెస్టు
గత ఎన్నికలకు ముందు వై నాట్ 175.. అన్ని సీట్లు తామే గెలుచుకుంటామని ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టింది ఆ పార్టీ. దీని ద్వారా బెట్టింగులకు ప్రోత్సహించడం, ఆ ఉచ్చులో నష్టపోయినవారిలో నాగమల్లేశ్వరరావు ఒకరు. సరిగ్గా ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు చనిపోతే ఇప్పుడు వెళ్లడం ఏంటన్నది పాలక పక్షం నుంచి ప్రశ్నలు రైజ్ చేస్తోంది.
కూటమి పాలనపై ఏడాది తర్వాత ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు జగన్. ఓదార్పు పేరుతో నాటకాలు అడుతున్నారని అంటోంది. బెట్టింగ్ బారిన పడి సర్వం కోల్పోయిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జూన్ 9 మరణించాడు. కరెక్టుగా ఏడాది తర్వాత ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు జగన్.
టీడీపీ నేతలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే జగన్ బయటకు వస్తారని అంటున్నారు. టీడీపీ ఆరోపణలు చేసినట్టుగానే జరుగుతోంది. ఇంతకీ జగన్ టూర్‌పై పోలీసులు ఏం చెబుతున్నారు? పల్లెటూరు ఆపై చిన్నరోడ్డు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా జగన్ సహా కేవలం వంద మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు.
జగన్ కాన్వాయ్‌తో పాటు అదనంగా మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు పల్నాడు ఎస్పీ తెలిపారు. వాటిని అధిగమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పకనే చెప్పారు అధికారులు. వైసీపీ మాత్రం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ టూర్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
నేడు పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటన..
ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
భద్రతా కారణాల దృష్ట్యా జగన్ సహా కేవలం వంద మందికే పోలీసుల అనుమతి
జగన్ కాన్వాయ్‌తో పాటు అదనంగా మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి pic.twitter.com/vgK9Pje0eO
— BIG TV Breaking News (@bigtvtelugu) June 18, 2025
జగన్ పార్టీ కోసం, జగన్ పాలనలో బెట్టింగ్ వేసి, అప్పుల పాలై ఏడాది క్రితం వైసీపీ నేత సత్తెనపల్లి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే.. ఇప్పుడు పరామర్శ ఏంటి? జగన్ రెడ్డి..!#PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/XkU2kpcAuY
— Telugu Desam Party (@JaiTDP) June 17, 2025