Tollywood Heroine: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటికప్పుడు హీరోయిన్స్ ని తెగ ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతో మంది నటీమణులు ఇండస్ట్రీలోకి కోటి ఆశలతో అడుగుపెడుతున్నారు. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలి అంటే హీరోలు, దర్శకనిర్మాతలు అడిగే కమిట్మెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అని సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramyakrishna ) లాంటివాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్..
దీనికి తోడు మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి కమిటీలు అన్ని ఇండస్ట్రీలలో వేయాలి అని, ముఖ్యంగా టాలీవుడ్ లో కూడా వేస్తే బాగుంటుంది అంటూ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్స్ సమంత (Samantha), అనుష్క శెట్టి (Anushka Shetty) కోరడంతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లోనే కాదు ప్రతి సినీ ఇండస్ట్రీలో కూడా ఈ సమస్య ఉందని తేలిపోయింది.
ప్రతి నటీమణి ఈ సమస్య ఎదుర్కోవాల్సిందేనా?
అయితే ప్రతి ఒక్క హీరోయిన్ లేదా నటీమణి ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా అంటే చెప్పలేని పరిస్థితి. ఇలా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్న ఎంతోమంది వాటిని తిప్పికొడుతూ.. ఇప్పుడు స్టార్ స్టేటస్ ను కూడా సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ కొంతమంది మాత్రం ఇలాంటి ఇబ్బందుల బారిన పడి ఇప్పుడు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ.. తమకు జరిగిన అన్యాయాలను, ఎదురైన ఇబ్బందులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంకొంతమంది ఇలాంటి సమస్యలు ఎదురైతే ధైర్యంగా వాటిని మనం తిప్పి కొట్టాలని చెప్పుకొస్తున్నారు కూడా.
ఆ హీరో పై హాట్ కామెంట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఏకంగా ఒక హీరో పై చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక ఆ హీరో గురించి ఆమె మాట్లాడుతూ..” అవతల ఎంత పెద్ద తోపైనా ఇండస్ట్రీకి వచ్చిందంటే చాలు.. ఆ హీరో కన్యరికం చేయకుండా ఆగడు” అంటూ హాట్ బాంబ్ పేల్చింది . మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ హీరో ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
నెటిజన్ ను రిక్వెస్ట్ చేసుకున్న ప్రీతికా రావు..
ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ప్రీతికా రావు (Preetika Rao).. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయినప్పటికీ.. ఈమె తెలుగులో వరుణ్ సందేశ్(Varun Sandesh) తో కలిసి ‘ ప్రియుడు’ (2012) అనే సినిమా చేసింది. ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ప్రీతికా రావు, ఒక బాలీవుడ్ హీరోకి సంబంధించి సినిమాలోని ఒక రొమాంటిక్ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఆ వీడియో చివరికి ప్రీతికా కంట్లో పడింది. దీంతో వీడియోని తొలగించమని, వెంటనే సదరు నెటిజెన్
ను రిక్వెస్ట్ కూడా చేసింది.
ఆ హీరో కన్యరికం చేయకుండా వదలడు – వరుణ్ సందేశ్ బ్యూటీ
కానీ ఆ నెటిజన్ సినిమాల్లో చేసినప్పుడు లేనిది ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాధ కలిగిందా అంటూ కాస్త వ్యతిరేకంగా సమాధానం చెప్పాడు. దీంతో కోపం వచ్చిన ఈమె.. కొన్ని సీన్స్ అప్పటికప్పుడే షూట్ చేస్తారు. అలా చేసిందే ఆ సీన్ కూడా.. అసలే ఆ హీరో కొత్త హీరోయిన్స్ ని వదిలిపెట్టడు. ఎవరైనా కొత్త అమ్మాయి వచ్చిందంటే బెడ్ మీదకు లాగి కన్యరికం చేసే వరకు వదిలిపెట్టడు. అతనితో ఉన్న నా వీడియోని దయచేసి మీరు తొలగించండి అంటూ రిక్వెస్ట్ చేసింది. మొత్తానికైతే ఆ హీరో పై ప్రీతికా రావు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.