Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ కన్నప్ప.. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మంచు విష్ణు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఎదురవుతుంది. హిందూ పురాణాల్లోని శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నప్ప చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు ఇప్పుడు మంచు విష్ణు ఈ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ మూవీ పై ఇటీవల పలు కేసులు నమోదు అవుతున్న సంగతి తెలుసు.. తాజాగా ఈ చిత్రయూనిట్ కు మరో బిగ్ షాక్ తగిలింది. మంచు విష్ణు, మోహన్ బాబుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
‘కన్నప్ప’ కు హైకోర్టు నోటీసులు..
కన్నప్ప మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు పాటలు ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అయితే కొందరికి ఈ సినిమాలోని కొన్ని పాత్రలు అభ్యంతరం కలిగించాయి. దాంతో వ్యతిరేకత మొదలైంది. ఈ మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన ‘పిలక’, ‘గిలక’ పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తున్నాయని, సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.. మూవీలోని ఈ పాత్రలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.. అనంతరం ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్ ముఖేష్‌కుమార్ సింగ్, మంచు మోహన్‌బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి.వెంకట ప్రభుప్రసాద్, సప్తగిరికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు..
Also Read : సినిమాల్లో చనిపోయే క్యారక్టర్లో నటించని హీరోలు వీళ్లే..
మరోసారి మూవీ వాయిదా..
కన్నప్ప మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో కొన్ని అభ్యంతరకరపు సన్నివేశాలు ఉండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని కారణాలవల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు హైకోర్టు నోటీసులు వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. కాగా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ కు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాపై అంచనాలు మెల్లగా తగ్గుతున్నాయని తెలుస్తుంది.. పరిస్థితుల నుంచి మంచు విష్ణు ఎలా బయటపడతాడో చూడాలి.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, ప్రభాస్, అక్షయ్ కుమార్ నటిస్తున్నారు..