BigTV English

TDP Targets Jagan: నెక్ట్స్ టార్గెట్ జగన్.. సజ్జల జస్ట్ శాంపిల్, వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ప్లాన్

TDP Targets Jagan: నెక్ట్స్ టార్గెట్ జగన్.. సజ్జల జస్ట్ శాంపిల్, వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ప్లాన్

TDP Targets Jagan: చంద్రబాబు సర్కార్‌ను మాజీ సీఎం జగన్ లైట్‌గా తీసుకున్నారా? ఎందుకు వైసీపీ ప్లాన్లు బూమరాంగ్ అవుతున్నాయి? కూటమి సర్కార్‌ ఏర్పడిన నుంచి బురద జల్లడం ప్రారంభించిందా? వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఏమంటున్నారు? జగన్ వ్యవహారశైలిపై విసిగి.. తలో దారి తీసుకునే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఏపీలో టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత జరుగుతున్న పని తీరు గమనిస్తున్నారు వైసీపీ సీనియర్లు, మాజీ మంత్రులు. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు సమయం, సందర్భం చూసి కౌంటర్లు ఇస్తోంది.

విపక్షాలకు ఎలాంటి మసాలా ఇవ్వకుండా ఇటు కేడర్, అటు నేతలను సీఎం చంద్రబాబు అలర్ట్ చేస్తున్నారు. వైసీపీ-టీడీపీ తేడా లేకుండా పోతుందని పదే పదే సున్నితంగా వార్నింగ్ లు ఇచ్చారు.. ఇస్తున్నారు కూడా.


చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ సీనియర్లలో చిన్నపాటి చర్చ జరుగుతోంది. ప్రభుత్వా నికి కనీసం రెండేళ్లయినా సమయం ఇవ్వకుండా వెంటనే ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏపీలో కొత్తగా మద్యం విధానం రావడం, రెండు రోజుల కిందట షాపుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. దానిపై అవినీతి జరిగిపోయిందని జగన్ మీడియా ముందు చెప్పడం కరెక్ట్‌గా కాదని అంటున్నారు.

ALSO READ:  ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం

చంద్రబాబు సర్కార్‌ను ఇబ్బందిపెట్టాలనే ఆలోచన తప్పితే, కూల్‌గా ఆలోచించలేదని అనుకుంటున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుండేదని అంటున్నారు.  దాని ఫలితమే వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగిసుకుంటోందని అనుకుంటున్నారు. సింపుల్‌గా పార్టీలో ఫైర్ అన్నది మిస్సయ్యిందన్నది నేతల మాట.

జగన్ వ్యవహారశైలి నచ్చక వైసీపీ శ్రేణులు చెల్లాచెదురు అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు జనసేన వైపు క్యూ కట్టారు. కొందరు జాయిన్ అయ్యారు.. మరికొందరు సంక్రాంతి తర్వాత వెళ్లేందుకు సిద్ధమైనట్టు అంతర్గత సమాచారం.

పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీ నేతలకు రావడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని వ్యవహారం. ఈ క్రమంలో జనసేన తప్పితే.. బీజేపీ వైపు ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేతలు అంతర్గతంగా చర్చిస్తున్నట్లు వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

సజ్జల లాంటి నేతలపై కేసులుంటే రేపటి రోజుల మన పరిస్థితి ఏంటని మాట్లాడు కుంటున్నారు. కేసుల పేరిట మనం పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే బదులు పార్టీ మారిపోతే సరిపోతుందనే అంచనాకు వస్తున్నారట కొందరు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబుకు ఫుల్ సపోర్టు ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. వారి బంధాన్ని విడగొట్టడం కష్టమేనని వాదన నడుస్తోంది. మోదీ సర్కార్‌లో టీడీపీ కీలక రోల్ ప్లే చేస్తుండడంతో చంద్రబాబు సర్కార్‌కు తిరుగులేకుండా పోయిందని అంటున్నారు. ఇండియా కూటమి వైపు జగన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయన వైపు మొగ్గు చూపలేదని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు సర్కార్ దూకుడుకు జగన్ వణుకుతున్నారనే చెప్పవచ్చు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×