BigTV English

OTT Movie : టీచర్ ను ఇష్టపడే 8 ఏళ్ల కుర్రాడు… ఓటిటిని ఊపేస్తున్న లేటెస్ట్ మూవీ

OTT Movie : టీచర్ ను ఇష్టపడే 8 ఏళ్ల కుర్రాడు… ఓటిటిని ఊపేస్తున్న లేటెస్ట్ మూవీ

OTT Movie : అన్నీ జానర్ల సినిమాలను చూసీ చూసి విసిగిపోయారా? అయితే ఈ మూవీ సజేషన్ మీ కోసమే.  తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యి భారీ వ్యూస్ దూసుకెళ్తున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. కన్నీళ్లు పెట్టించే ఈ ఎమోషనల్ సినిమా ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రియల్ స్టోరీ ఆధారంగా.. 

1999 ఫిబ్రవరి 22న జరిగిన ఓ ఘోర ప్రమాదం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగింది. ఆ రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఇందులో నిఖిల విమల్, కలైరాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ‘వాళై‘ (Vaazhai) అనే ఈ తమిళ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే…

రోజువారి కూలి చేసుకుని బతికే జనాల జీవితాలు ఎలా ఉంటాయన్న స్టోరీని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు డైరెక్టర్. ఇందులో శేఖర్, శివానందన్ అనే ఇద్దరు పిల్లలు పేద కుటుంబానికి చెందిన స్నేహితులు. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతారు. వారమంతా బడికి వెళ్లే ఈ పిల్లలు వీకెండ్ ఇల్లు గడవడం కోసం అరటి గెలలు కోసే పనికి వెళ్తారు. శివానందం బాగా చదువుతాడు. అతనికి ఈ పని అస్సలు నచ్చదు. ఇక తనకు  చదువుకోవడమే కాదు సైన్స్ పాఠాలు చెప్పే టీచర్ అంటే చాలా ఇష్టం. మరోవైపు అరటి పండ్లు కోయడానికి ఊరికి చెందిన ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తాడు. ముత్తురాజ్ అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్ గా వ్యవహరిస్తాడు. ఖనికి ముత్తురాజుకు మధ్య కూలీ డబ్బుల గురించి గొడవ జరుగుతుంది. అప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు.

అయితే ఓ రోజు స్కూల్ కి వెళ్లాలనే ఆశతో శివానందన్ అరటి గెలల పని తప్పించుకొని స్కూల్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఆకలితో ఓ తోట కెళ్ళి అరటి పండ్లు తినడానికి ట్రై చేస్తాడు. అయితే  ఆకలికి తట్టుకోలేక ఆ పని చేస్తాడు. కానీ ఆ తోట యజమాని శివానందన్ ను దొంగతనం చేస్తావా అని కొడతాడు. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి ఓ కొలనులో స్పృహ తప్పి పడిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఊరంతా బోరుమని ఏడుస్తూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే శివానందమ్ అక్క, స్నేహితుడు శేఖర్, ఖనితో పాటు మొత్తం 19 మంది ఊరు వాళ్ళు శవాలై కనిపిస్తారు. వీళ్లంతా ఎలా చనిపోయారు? చివరికి శివానందన్ పరిస్థితి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే వాళై (Vaazhai) అనే ఈ కన్నీటి గాథని తెరపై చూడాల్సిందే. తియ్యటి ఆరటి పండు ఎంత మంది జీవితాలలో చేదు ను మిగిల్చిందో ఈ సినిమాలో చూడొచ్చు.

Related News

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీసే టార్గెట్… బుర్ర బద్దలయ్యే ట్విస్టులున్న మిస్టీరియస్ బాక్స్… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : ఫామ్ హౌజ్ లో పార్టీ… అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

Coolie OTT: రజినీకాంత్ కూలీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

OTT Movie : ఇదెక్కడి సినిమారా బాబూ… మొక్కలకు ప్రాణం వచ్చి మనుషుల్ని లేపేస్తే… సై -ఫై మాస్టర్ పీస్ థ్రిల్లర్

OTT Movie : 30 ఏళ్ల ఆంటీతో 23 ఏళ్ల కుర్రాడు… పెళ్ళైనా వదలకుండా… సింగిల్స్ డోంట్ మిస్

OTT Movie : తెల్లార్లూ అదే పని… ప్రతి రాత్రి ఒంటరిగా ఆ గదికి… ఏం చేస్తుందో తెలిస్తే ఫ్యూజులు అవుట్

Big Stories

×