మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన విమర్శలు, దానికి ప్రతిగా రోజా విమర్శలు ఏపీలో గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారాయి. ఈలోగా మిథున్ రెడ్డి అరెస్ట్, హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్లో పవన్ ప్రసంగాలతో రోజా ఎపిసోడ్ కాస్త పాతబడింది. అయితే టీడీపీ మాత్రం ఆమెను వదిలేలా లేదు. రోజా గతంలో చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని మరోసారి నెటిజన్లకు గుర్తు చేస్తూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఆమధ్య గాలి నాకొ.. అంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీరియస్ గా ఉంది, అందుకే జనాలు మరచిపోయేలోగా మరోసారి ఆమె మాటల్ని గుర్తు చేస్తూ ట్వీట్ వేసింది.
నిందితురాలా? బాధితురాలా?
తిట్టిన వారు నిందితులు, తిట్టించుకున్నవారు బాధితులు. మరిక్కడ రోజా ఎవరు? ఆమెను కేవలం బాధితురాలిగా చూడాలా? మరి ఇతర నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? సాక్షి టీవీ ఇంటర్వ్యూలో రోజా కన్నీరు పెట్టుకున్నారు, ఆ తర్వాత రెండ్రోజుల గ్యాప్ లోనే గాలి నాకొ.. అంటూ బూతులు మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో వైసీపీ నేతలు కూడా రోజాకి సపోర్ట్ గా మాట్లాడటానికి ఆలోచిస్తున్నారనే చెప్పుకోవాలి. అటు టీడీపీ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా రోజా వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తోంది. దీంతో అసలామె బాధితురాలు కాదని అంటున్నారు నెటిజన్లు. బూతులు తిట్టడంలో ఆమెను ఎవరూ బీట్ చేయలేరని విమర్శిస్తున్నారు.
జగన్ మనసు దోచుకున్న బూతు నేత..!
రోజాని ట్రోల్ చేసే క్రమంలో జగన్ ని కూడా టార్గెట్ చేసింది టీడీపీ. వైసీపీ హయాంలో జగన్ ని ప్రసన్నం చేసుకోడానికి నేతలంతా పోటీ పడేవారని, ఈ క్రమంలో రోజా అందర్నీ బీట్ చేసి మొదటి స్థానం కైవసం చేసుకున్నారని చెబుతూ రోజా పాత వీడియోలన్నీ కలిపి ట్వీట్ చేశారు టీడీపీ నేతలు. జగన్ మనసు దోచుకున్న బూతు నేత.. ఎవరు ? ఎవరా విజేత ? గుడివాడ గుట్కా నా ? చెన్నై రోజా నా ? వీళ్ళా ప్రజా సేవ చేసే నాయకులు ? అంటూ టీడీపీ ట్వీట్ చేయడం విశేషం.
బూతుల విషయంలో ఏ రాజకీయ నాయకుడినీ ప్రజలు సమర్థించరు, ఎవరి మాటల్ని ప్రజలు హర్షించరు. కానీ బూతులు తిడుతున్నారంటూ వైసీపీ నేతలు చెప్పే మాటల్ని మాత్రం ఎవరూ పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం. ఎందుకంటే వైసీపీ హయాంలోనే ఈ మాటలు బాగా పాపులర్ అయ్యాయి. వ్యక్తిగత విమర్శలు, అలవోకగా ప్రెస్ మీట్లలో బూతులు మాట్లాడటం, పక్కన మహిళా నేతలు ఉన్నారని కూడా చూసుకోకుండా బూతులు తిట్టడం వైసీపీ నుంచే ఎక్కువగా జరిగాయని అంటున్నారు నెటిజన్లు. అందులో కూడా రోజా అందర్నీ వెనక్కి నెట్టారని, ఆ విషయంలో జగన్ మనసు మెప్పించారని సెటైర్లు పేలుస్తున్నారు. రోజా ఎపిసోడ్ పాతబడిపోయిందని అనుకున్నప్పుడల్లా టీడీపీ ఇలా ఆమె మాటల్ని హైలైట్ చేయడం ఇక్కడ విశేషం. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా రోజాని ఉద్దేశిస్తూ పరోక్షంగా సెటైర్లు వేశారు. తాను ఊళ్లన్నీ తిరిగే పవనం అయితే, తనపై విమర్శలు చేసేవారు బావిలో కప్పలు అని అన్నారు. పవన్ వ్యాఖ్యలకు రోజా కూడా ట్విట్టర్లో బదులిచ్చారు.
జగన్ మనసు దోచుకున్న బూతు నేత ఎవరు ? ఎవరా విజేత ?
గుడివాడ గుట్కా నా ? చెన్నై రోజా నా ?వీళ్ళా ప్రజా సేవ చేసే నాయకులు ?#PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/O948O7Talo
— Telugu Desam Party (@JaiTDP) July 25, 2025