BigTV English
Advertisement

Hydrogen Train: నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!

Hydrogen Train: నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!

Hydrogen Train Test: భారతీయ రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF) తయారు చేసిన తొలి హైడ్రోజన్ రైలు పరీక్ష విజయవంతం అయ్యింది. ఈ సక్సెస్ భారతీయ రైల్వేలో మరో అద్భుతం అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. “తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే కోచ్ (డ్రైవింగ్ పవర్ కార్) చెన్నైలోని ICFలో విజయవంతంగా పరీక్షించబడింది. భారతదేశం 1,200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఈ రైలు భారత్ ను హైడ్రోజన్ శక్తితో నడిచే రైల్వే టెక్నాలజీలో అగ్రగామిగా ఉంచబోతోంది” అని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


గ్రీన్ రవాణాలో కీలక ముందడుగు

కాలుష్యం లేని గ్రీన్ రవాణా రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నేపథ్యంలో ఈ రైలు ఓ కీల మైలు రాయిగా చెప్పుకోవచ్చు.  హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకలంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రైళ్లను దేశ వ్యాప్తంగా హెరిటేజ్, హిల్ స్టేషన్లలో నడపాలని భావిస్తోంది.  ఒక్కో రైలుకు ₹80 కోట్ల అంచనా వ్యయంతో పాటు ఒక్కో రూట్‌  గ్రౌండ్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కు సపోర్టు చేయడానికి అదనంగా ₹70 కోట్లు కేటాయిస్తోంది రైల్వేశాఖ.


DEMUలను హైడ్రోజన్ రైళ్లుగా మార్చే ప్రయత్నం

ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్తో నడిచేలా తయారు చేసే పైలట్ ప్రాజెక్ట్‌ ను కూడా  రైల్వేశాఖ ప్రారంభించింది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ఉత్తర రైల్వే పరిధిలోని  జింద్-సోనిపట్ విభాగంలో నడపడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read Also: హైదరాబాద్ నుంచి వెళ్లే ఆ రైళ్లలో స్లీపర్ కోచ్‌ల పెంపు.. ఇక ఆ కష్టాలు తీరినట్లే!

హైడ్రోజన్ రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ ఖర్చు తగ్గే అవకాశం!

హైడ్రోజన్ ఆధారిత రైళ్ల నిర్వహణ ఖర్చు ఎంత అవుతుందనే అంశంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే, హైడ్రోజన్ రైళ్ల సంఖ్య పెరిగేకొద్దీ కార్యాచరణ ఖర్చులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. హైడ్రోజన్ పవర్ కారణంగా కాలుష్యం అనేది పూర్తిగా తగ్గనుంది. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. డబ్బు కంటే పర్యావరణ హితమైన ప్రయాణం కోసం రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇప్పటికే రైల్వేశాఖ వెల్లడించింది. హైడ్రోజన్ రైళ్లు దేశ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వ్యూహంలో కీలక అంశంగా మారాయని చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ మొబిలిటీ వైపు భారత్ శరవేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు రైల్వేను కూడా  హైడ్రోజన్ ఇంధనంతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Read Also: హైదరాబాద్ నుంచి వెళ్లే 6 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Big Stories

×