BigTV English

TDP vs YCP : ఏపీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. నేతల మధ్య డైలాగ్ వార్.. ఈసీకి ఫిర్యాదు

TDP vs YCP : ఏపీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ.. నేతల మధ్య డైలాగ్ వార్.. ఈసీకి ఫిర్యాదు
AP politics

TDP vs YCP(AP politics):

ఏపీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ డైలాగ్‌ వార్‌తో పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది. ఓటరు జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న తెలుగు తమ్ముళ్లు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డీపీ టార్గెట్‌గానే ఓట్లు తొలగిస్తున్నారని.. దొంగ ఓట్లను చేరుస్తున్నారని.. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకున్నారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో యనమల, పయ్యావుల, నిమ్మల, బోండా ఉమ, కనకమేడలతోపాటు పలువురు నేతలు ఈసీని కలిసిన వారిలో ఉన్నారు.


ఇక ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్‌ సర్కార్‌ ఏపీలో ఎన్నికలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. గ్రామ సచివాలయ వ్యవస్థ కనుసన్నల్లోనే ఇదంతా జరగుతోందని ఆరోపించిన ఆయన.. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని.. ఇదే విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. డూప్లికేట్‌, మృతులు, వలస కూలీలు, చూకి లేని వారు ఇలా దాదాపు 15 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని ఈసీకి తెలిపారు.

అయితే.. గత టీడీపీ హయాంలో 50 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపిస్తున్న వైసీసీ.. డీపీ ఫిర్యాదుకు కౌంటర్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ దొంగల ముఠాకు ఏ మాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని.. మోసం చేయడంలో కొత్త కొత్త టెక్నిక్‌లు తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీనని మండిపడ్డారు. పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది జాగ్రత్త అంటూ ఫైర్‌ అయ్యారు.


.

.

.

Related News

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×