E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో ఫోటోషూట్ ఇష్యూ.. తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ..

Tirumala News: తిరుమలలో ఫోటోషూట్ ఇష్యూ.. తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ..
Advertisement

Tirumala News: తిరుమల కొండపై కొత్త జంట ఫోటోషూట్ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఫోటోషూట్ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో నేరుగా నూతన దంపతులు రంగంలోకి దిగారు. అంతేకాదు కొన్ని విషయాలు బయటపెట్టారు. మళ్లీ వస్తామని అంటున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది?

తిరుమలలో దంతపుల ఫోటోషూట్ వ్యవహారం

Advertisement

తిరుమల కొండపై నూతన దంపతులు మాడవీధుత్లో నానాహంగామా చేశారు. లొకేషన్ ఎక్కడ బాగుంటే అక్కడ ఫోటోషూట్ చేశారు. అంతేకాదు నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాలు బయటకు కనిపించడంతో భక్తులు ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. ఈ జంటకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో తొలుత కంగారుపడింది ఆ జంట. తమ పరువు పోతుందని భావించిన నేరుగా ఓ వీడియో రిలీజ్ చేసింది.

తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తిరుమల్-గాయత్రి దంపతులకు ఇటీవల వివాహం జరిగింది. వివాహం తర్వాత ఈ జంట తొలుత తిరుమల పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో సినిమాటిక్ స్టైల్‌లో ఫోటో‌షూట్ చేశారు. అంతేకాదు మధ్యమధ్యలో కొన్ని రీల్స్ చేశారట. తిరుమల కొండపై రీల్స్, ఫోటోషూట్‌ లపై ఆంక్షలు ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది కళ్లుగప్పారు.

Advertisement

తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ

వీరి వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆ దంపతులు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం మాకు లేదన్నారు. తెలియక చేసిన తప్పును క్షమించాలని అందులో కోరారు. త్వరలో తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని చేసిన తప్పును సరిదిద్దుకుంటామని వేడుకున్నారు.

ఈ వ్యవహారంలో తప్పంతా సెక్యూరిటీ సిబ్బందేనని అంటున్నారు శ్రీవారి భక్తులు.  స్వామి సన్నిధిలో అంత జరుగుతున్నా సెక్యూరిటీ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు? తిరుమల కొండపై అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిని మోనటరింగ్ చేస్తున్న సిబ్బంది మాటేంటి?  అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. తప్పులు చేసి సారీ చెప్పడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్‌గా మారిందని అంటున్నారు.

ALSO READ: అరవ శ్రీధర్ ఎంత పని చేశారు.. కొత్త వీడియోలో కీలక అంశాలు

నూతన దంపతులు చేసిన తప్పును తెలుసుకున్నారని అంటున్నారు. బాధ్యతలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఇలాంటి తప్పు మరొకసారి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×