E-Paper
Advertisement

Dhurandhar OTT: ఓటీటీలో లవర్స్ కు షాకిచ్చిన దురంధర్.. కారణమేంటంటే..?

Dhurandhar OTT: ఓటీటీలో లవర్స్ కు షాకిచ్చిన దురంధర్.. కారణమేంటంటే..?
Advertisement

Dhurandhar OTT: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దురంధర్.. డిఫరెంట్ స్టోరీ తో భారీ యాక్షన్స్ సన్నివేశాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఒకవైపు సినిమాని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్లు వినిపిస్తున్న సరే.. మరోవైపు సినిమా పై విమర్శలు ఎదురవుతున్న.. ఈ మూవీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసింది.. రణవీర్ సినీ కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.. ఈ మూవీ ఇవాళ భారీ అంచనాలతో ఓటీటీలోకి వచ్చేసింది.. అయితే ఈ చిత్రం ఓటీటీ లవర్స్ కు షాకిచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసిన దురంధర్..

బాలీవుడ్ ఆడియన్స్ తో పాటుగా ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన రణవీర్ సింగ్ లేటెస్ట్ హిట్ మూవీ దురంధర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. కానీ అనూహ్యంగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక ఆడియెన్స్ ని దారుణంగా డిజప్పాయింట్ చేసింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేంటంటే.. ఈ మూవీ థియేటర్లలోకి మూడు గంటల 34 నిమిషాల నిడివితో వచ్చేసింది.. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత 3 గంటలకు 20 నిముషాలతో వచ్చిందని టాక్ నెట్టింట వినిపిస్తుంది. దీంతో ఈ 14 నిమిషాలను ఎందుకు మేకర్స్ కట్ చేశారో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మూవీ లవర్స్ తమ నిరాశని వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనిపై చిత్ర యూనిట్స్ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాలి…

Advertisement

Also Read : తండ్రిని గుర్తుచేసుకున్న మహా.. మహా తిండిని చూసి చక్రీ.. గాయత్రికి తాయారు వార్నింగ్..

బోల్డ్ కంటెంట్ మిస్.. 

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సినిమాలలో ఎక్కువగా మెసేజ్ కూడా ఉంటుంది.. కొన్ని సినిమాలు జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు వచ్చిన ఈ దురంధర్ మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ మూవీ భారీ సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా రోజురోజుకీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.. ఇకపోతే ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. అయితే మామూలుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు కాస్త బోల్డ్ గానే ఉంటాయి.. కానీ ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకపోవడంతో ఎక్కువగా సినిమాలు డైరెక్ట్ గానే ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమాకు మాత్రం కొన్ని సీన్లు కట్ చేయడంపై సర్వత్ర చర్చలు కొనసాగుతున్నాయి.. ఆడియెన్స్ దారుణంగా డిజప్పాయింట్ అయ్యినట్టు చెబుతున్నారు.. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి..

Advertisement

 

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×