E-Paper
Advertisement

Eesha Rebba: త్రివిక్రమ్ మోసం చేశారు.. గుట్టు రట్టు చేసిన ఈషా రెబ్బా

Eesha Rebba: త్రివిక్రమ్ మోసం చేశారు.. గుట్టు రట్టు చేసిన ఈషా రెబ్బా

Eesha Rebba: ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.’అంతకుముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మాయ మాల్, దర్శకుడు, బ్రాండ్ బాబు, బందిపోటు, అమీ తుమీ, సుబ్రహ్మణ్యపురం , అ!, రాగల 24 గంటల్లో, మామా మశ్చీంద్ర వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే అందం అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో క్రేజీ ఆఫర్లు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషా రెబ్బా

అలాంటి ఈమె చాలా రోజుల తర్వాత ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) హీరోగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా జంటగా ఈ సినిమా చూసేవారి కోసం వన్ ప్లస్ వన్ ఆఫర్ టికెట్ కూడా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన థియేటర్లలో నిన్న ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. అలా ఈ సినిమాపై మరింత హైప్ పెంచడానికి వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈషా రెబ్బా తన కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా చెప్పుకొచ్చింది.

త్రివిక్రమ్ నన్ను మోసం చేశారు..

ఈషా రెబ్బా మాట్లాడుతూ.. “ఒక సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను మోసం చేశారు” అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్)Jr NTR) హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో.. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ . ఇందులో పూజా హెగ్డే కి చెల్లి పాత్రలో నటించింది ఈషా రెబ్బా. అప్పటికే హీరోయిన్గా సెటిల్ అయినా ఈమెకు ఈ సినిమాలో పాత్ర చూసిన తర్వాత కనీసం ప్రాధాన్యత లేని సపోర్టింగ్ రోల్ ఎందుకు చేసిందని ఆమె అభిమానులు కూడా పెదవి విరిచారు. అయితే తాజాగా ఈ విషయంపై ఈషా స్పందించింది.

ALSO READ:MS Narayana: మాట కోసం సర్వం కోల్పోయిన మహానటుడు.. ఎమ్మెస్ కుమార్తె ఎమోషనల్ కామెంట్స్!

చాలా బాధపడ్డాను..

ఈషా మాట్లాడుతూ..” అరవింద సమేత కథ విన్నప్పుడు ఆ సినిమాలో నటించాలని అనుకున్నాను. అయితే కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా కాకుండా వేరే పాత్రలు చేస్తే ఆడియన్స్ ఆదరించారు అనే భయం కలిగింది. పైగా తదుపరి చిత్రాల్లో కూడా అలాంటి అవకాశాలు వస్తాయేమో అని కాస్త భయపడ్డాను. ఆ సమయంలో త్రివిక్రమ్ నాదొక లీడ్ రోల్ అని చెప్పారు. ఒకవైపు హ్యాపీగా ఉన్నా.. ఫ్యూచర్లో స్టీరియో టైప్ చేసేస్తారని మరొకవైపు టెన్షన్ పడ్డాను. కానీ కొన్ని రోజులకు ఆ భయం పోయింది. పెద్ద ప్రొడక్షన్ హౌస్.. బిగ్ డైరెక్టర్.. పెద్ద ప్రాజెక్టు కాబట్టి అందరూ నా గురించి మాట్లాడుకునే వారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చాలామంది ఫోన్ చేసి ఈ సినిమా ఎందుకు చేసావ్.. అసలు ఆ పాత్రలో ఏముంది? అని అడిగారు. ఎంతో బాధపడ్డాను. నాకు ఇతర క్యారెక్టర్లు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. కాకపోతే అలాంటి రోల్స్ చేసుకుంటూ పోతే హీరోయిన్ గా నన్ను అంగీకరించరేమో అన్న భయం ఉందని” ఆమె చెప్పుకొచ్చింది మొత్తానికైతే మంచి పాత్ర అని చెప్పి తనకు అలాంటి పాత్ర ఇచ్చే మోసం చేశారని త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది ఈషా రెబ్బా.

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×