E-Paper
Advertisement

వైఎస్ ఫ్యామిలీలో విషాదం.. జగన్ పెదనాన్న మృతి, పులివెందులకు మాజీ సీఎం

వైఎస్ ఫ్యామిలీలో విషాదం.. జగన్ పెదనాన్న మృతి,  పులివెందులకు మాజీ సీఎం
Advertisement

Pulivendula: వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. జగన్ పెద్దనాన్న ఆనంద్ రెడ్డి మరణించారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలియగానే ఉత్తరాంధ్ర నుంచి పులివెందులకు జగన్ పయనమయ్యారు.

వైఎస్ ఫ్యామిలీలో విషాదం-వైఎస్ ఫ్యామిలీలో మరొక విషాదం చోటు చేసుకుంది. జగన్ పెదనాన్న ఆనంద్‌‌రెడ్డి గురువారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈలోకాన్ని విడిచిపెట్టారు. ఆనంద్‌రెడ్డి ఎవరోకాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి సోదరుడు కొండారెడ్డి కుమారుడు ఆనంద్ రెడ్డి.

Advertisement

జగన్ పెదనాన్న ఆనంద్‌రెడ్డి మృతి-వైఎస్ రాజశేఖర్ రెడ్డికి  ఆనంద్ రెడ్డి కజిన్ బ్రదర్ అన్నమాట. వైఎస్ ఆనంద్ రెడ్డి భార్య సుశీలమ్మ గతేడాది మరణించగా, ఇప్పుడు ఆనంద్‌రెడ్డి చనిపోయారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్, పెదనాన్న మరణవార్త తెలియగానే షాకయ్యారు.

పులివెందులకు మాజీ సీఎం-శ్రీకాకుళం టూర్‌లో ఉన్న ఆయన, శుక్రవారం ములాఖత్‌లో సీదిరి అప్పలరాజుతో భేటీ తర్వాత అక్కడి నుంచి నేరుగా పులివెందులకు వెళ్లనున్నారని సమాచారం. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆనంద్ రెడ్డి అంత్యక్రియలు పులివెందులలో జరగనున్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియలకు జగన్ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

Advertisement

ఆనంద్ రెడ్డి మృతివార్త తెలుసుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ప్రకాష్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, మధురెడ్డి, తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

ALSO READ: తెలిసో తెలియకో యాక్సిడెంట్ చేశాడు.. దాన్ని కుట్ర అంటున్నారు-జగన్

Related News

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×