YS Jagan: యాక్సిడెంట్ ఎవరూ కావాలని చేయరు. యాక్సిడెంట్ హత్య ఎలా అవుతుంది? గొర్రెల కాపరి ఎవరో కూడా వీరికి తెలియదు. దురదృష్టవశాత్తు జరిగిన యాక్సిడెంట్ అది. చిన్నపిల్లాడు చేసిన యాక్సిడెంట్ కు హత్య, కుట్ర కోణం ఆపాదించారని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు.
బైక్ యాక్సిడెంట్ జరిగితే కుట్ర కోణం ఎక్కడుంది? అప్పలరాజు టెన్త్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్.. చంద్రబాబు అప్పట్లో అభినందించారు కూడా సీదిరి అప్పలరాజు సామాన్య కుటుంబం నుంచి వచ్చి మంత్రిగా ఎదిగారు. సీదిరిపై తప్పుడు కేసును బనాయించారు. టీడీపీకి చెందినవారు కూడా యాక్సిడెంట్ చేస్తే వారిపైనా ఇలాగే కుట్ర కేసులు పెడతారా? అంటూ జగన్ ఫైర్ అయ్యారు.
Also Read: జహీరాబాద్‌లో షాకింగ్ సీన్.. చెప్పుతో కొట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ భర్త!
అప్పలరాజు కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారు. చెడు విత్తనాలు నాటుతున్నారు. ఇవి వృక్షాలై వ్యవస్థను నాశనం చేస్తాయి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే 108కు ఫోన్ చేసి, సీపీఆర్ కూడా చేశాడు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు అప్పలరాజు అరెస్ట్ ఒక ఉదాహరణ అని వైఎస్ జగన్ అన్నారు.
సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లోడు, మొన్ననే నీట్ రాశాడు. తెలిసో తెలియకో పొరపాటున యాక్సిడెంట్ చేస్తే దానికి కుట్ర కోణం అంటగట్టారు. అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంతవరకు సమంజసం కాదని వైఏస్ఆర్‌సీపీ జగన్ అన్నారు.
Also Read: నా ఇంటిపై బాంబులేస్తారా నిన్ను వదలను.. అంబటి రాంబాబు ఫైర్!