E-Paper
Advertisement

YS Jagan @ 11: జగన్ ను వదలని 11 సెగ.. మరీ ఇంత ప్రచారమా!

YS Jagan @ 11: జగన్ ను వదలని 11 సెగ.. మరీ ఇంత ప్రచారమా!
Advertisement

YS Jagan @ 11: మాజీ సీఎం జగన్ కు 11 సెగ మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు. ఏపీలో ఎన్నికలు ముగిసి 7 నెలలు కావస్తున్నా, 11 నెంబర్ మాత్రం వైసీపీని వదలట్లేదు. సోషల్ మీడియాలో 11 నెంబర్ కు ఒక క్రేజ్ తెచ్చేలా మీమ్స్ కూడ వైరల్ గా మారాయి. ఆ మీమ్స్ ఓ రేంజ్ లో ఉండడంతో వైసీపీకి పెద్ద తలనొప్పులు తెస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల ఓ కారుకు గల నెంబర్ తో ట్రోలర్స్ విపరీతంగా ట్రోలింగ్ చేస్తుండడం విశేషం.

ఏపీలో ఎన్నికల ఫలితాలు కూటమి, వైసీపీ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చాయి. కూటమికి ఊహించని రీతిలో 164 సీట్లు రాగా, వైసీపీకి 11 సీట్లు దక్కాయి. ఫలితాలు విడుదలైన సమయం కాస్త ట్రోలింగ్ అంతగా లేదని చెప్పవచ్చు. రాను రాను 11 నెంబర్ పై మాత్రం పరోక్షంగా ట్రోలర్స్ తమ సత్తా చాటుతూ, సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నారు. కూటమికి వచ్చిన 164 నెంబర్ ని కూడితే 11 వస్తుంది. అదే వైసీపీకి దక్కిందని కొందరు విపరీతంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారు.

Advertisement

అంతేకాదు జబర్దస్ట్ లాంటి కామెడీ షోలలో కూడ హైపర్ ఆది వంటి కమెడియన్స్ తమ స్కిట్ లలో 11 గురించి ప్రస్తావించి నవ్వులు పూయించారు. ఇలా ఏపీలో 11 నెంబర్ అంటేనే వైసీపీ గుర్తొచ్చేలా సోషల్ మీడియా పరోక్షంగా కోడై కూస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఉండి ఎమ్మేల్యే త్రిబుల్ ఆర్ ( రఘురామ కృష్ణంరాజు ) వాహనం నెంబర్ ను ఉద్దేశించి, 11 నెంబర్ మరోమారు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ కారు నెంబర్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అందుకు ప్రధాన కారణం ఆ కారు నెంబర్ ఏపీ 11 ఏపీ 1111 కావడమే.

Also Read: CM Chandrababu: నన్ను మోసం చేశారు.. వదిలిపెట్టను.. బాబు వార్నింగ్

Advertisement

ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదాలో గల ఎమ్మేల్యే రఘురామ కృష్ణంరాజుకు చెందిన కారుగా ఇది ప్రచారం సాగుతోంది. కాగా పదేళ్ల క్రితం త్రిబుల్ ఆర్ ఈ కారు నెంబర్ ను పొందినట్లు సమాచారం. యాదృచ్చికంగా ఆ కారు నెంబర్ లో అన్నీ 11 లు ఉండడంతో, రాజు గారూ.. మీరు సూపర్ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీకి కేవలం 11 సీట్లు దక్కినా, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, ఇలా ట్రోలింగ్ చేయడం కూడ సబబు కాదని పలువురి అభిప్రాయం. ఏదిఏమైనా వైసీపీకి 11 నెంబర్ సెగ మాత్రం ఇప్పుడిప్పుడే వదిలేలా లేదని చెప్పవచ్చు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×