BigTV English
Advertisement

Sorakaya Halwa: సొరకాయ హల్వా ఇలా చేశారంటే దాని రుచి జీవితంలో మర్చిపోరు, రెసిపీ చాలా సులువు

Sorakaya Halwa: సొరకాయ హల్వా ఇలా చేశారంటే దాని రుచి జీవితంలో మర్చిపోరు, రెసిపీ చాలా సులువు
హల్వా ఏదైనా కూడా తియ్యగా, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాంటి హల్వా కాకుండా ఈసారి సొరకాయ హల్వా ప్రయత్నించండి. సొరకాయ అనగానే ఎంతోమందికి మొఖం వాడిపోతుంది. నిజానికి సొరకాయతో చేసే హల్వా తిన్నవాళ్ళు మర్చిపోలేరు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. సొరకాయ హల్వా ఎలా చేయాలో తెలుసుకోండి.


సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు
సొరకాయ – ఒకటి
బాదం పప్పులు – గుప్పెడు
జీడిపప్పు – గుప్పెడు
ఎండు ద్రాక్షలు – గుప్పెడు
పాలు – లీటరున్నర
నెయ్యి – రెండు స్పూన్లు
పంచదార – ఒక కప్పు
యాలకుల పొడి – అర స్పూను

సొరకాయ హల్వా రెసిపీ
1. సొరకాయ హల్వా చేసేందుకు లేత సొరకాయను ఎంపిక చేసుకోవాలి. పైన చెక్కును తీసేసి గింజలను తీసి పక్కన పెట్టాలి.
2. ఇప్పుడు సొరకాయను చిన్నగా తురుముకోవాలి. ఆ తురిమిన సొరకాయను ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.
3. కాసేపటికి అందులోంచి నీరు దిగుతుంది. ఆ నీటిని పిండి ఆ సొరకాయ తురుమును పక్కన పెట్టుకోవాలి.
4. బాదం పప్పులు, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వంటివన్నీ కూడా సన్నగా తరగాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పాలు పోయాలి.
6. పెద్ద మంట మీద ఆ పాలను మరిగించాలి. అవి సగానికి పైగా తగ్గిపోయే వరకు మరిగిస్తూనే ఉండాలి.
7. అలా పాలు అర లీటర్ అయ్యేంతవరకు ఉంచాలి.
8. పాలు మరుగుతున్నప్పుడు మరొక బర్నర్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
9. ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో సొరకాయ తురుమును వేసి బాగా వేయించుకోవాలి.
11. తడి మొత్తం పోయి సొరకాయ దగ్గరగా అయ్యేంతవరకు వేయించాలి.
12. అందులోనే పంచదారను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. ఇది జిగురుపాకం వచ్చేవరకు బాగా కలపాలి.
14. ఇప్పుడు మరుగుతున్న పాలను ఈ సొరకాయ మిశ్రమంలో వేయాలి.
15. పాలు అప్పటికే చిక్కగా మారి ఉంటాయి. ఇప్పుడు సొరకాయ మిశ్రమాన్ని పాలల్లో బాగా కలపాలి.
16. యాలకుల పొడిని వేసి పావుగంట సేపు ఉడికిస్తే అది దగ్గరగా హల్వాలాగా అవుతుంది.
17. ఇప్పుడు ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను ఒక స్పూను నెయ్యిని వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయినట్టే.

సొరకాయ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఎక్కువ. అయినా సరే దీన్ని తినేవారి సంఖ్య తక్కువే. నిజానికి సొరకాయ జ్యూస్ ను రోజూ తాగితే హైబీపీ ఎంత ఉన్నా కూడా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న విషాలను, వ్యర్ధాలను తొలగించే శక్తి సొరకాయకు ఉంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు సొరకాయను తరచూ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది కచ్చితంగా మంచి ఫలితాన్ని చూపిస్తుంది. అలాగే సొరకాయను తరచూ తినేవారు బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. సొరకాయను కేవలం హల్వా రూపంలోనే కాదు సాంబారులో, పప్పులో కూడా వేసుకుని అప్పుడప్పుడు తింటూ ఉండండి. సొరకాయ సూపును కూడా చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సొరకాయ, టమాటాలు వేసే చట్నీ కూడా రుచిగా ఉంటుంది. ఎలాగైనా సరే సొరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.


Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×