Amaravati News: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారా? ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు చెవిలో పడిందా? అందుకే చీటికి మాటికీ నేతలను అధినేత హెచ్చరిస్తున్నారా? గడిచిన మూడు నెలల్లో ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది? సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఆయన జాబితాలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? మారకుంటే వేటు తప్పదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు మారడమేకాదు.. నేతలను కూడా మార్చుతున్నారు. లేకుంటే వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్ఠి సారించారు. ఆ తర్వాత అభివృద్దిపై ఫోకస్ చేశారు. ఈలోగా పార్టీలోని ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా రెచ్చిపోవడం మొదలైంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీస్తున్న ప్రత్యేక టీమ్, నేతల గురించి కీలక విషయాలు అధినేత దృష్టికి తీసుకొచ్చింది. గడిచిన మూడు నెలలుగా నేతలను పదే పదే హెచ్చరించారు.. కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.
కేవలం అభివృద్ధి మాత్రమేకాకుండా పార్టీపై ఫోకస్ చేశారు చంద్రబాబు. ఓ వైపు లోకేష్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని వారిని హెచ్చిరిస్తున్నారు. సమీక్షలు, వన్ టు వన్ భేటీల ద్వారా దాదాపుగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడినట్టు తేలింది. కేవలం మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందని శనివారం పార్టీ ఆఫీసులో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎలా మెరుచుపరచుకోవాలో సూచనలు కూడా చేశారు.
టార్గెట్ ఆ 37 మంది నేతలు మాత్రమే
ఉత్తరాంధ్రలో అరడజను, ఉభయగోదావరి జిల్లాల్లో ఐదుగురు, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఎనిమిది మంది, ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమ నుంచి మరో 17 మంది ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరి పనితీరుపైనా నాలుగైదు మార్గాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎం చంద్రబాబు. జిల్లాల కమిటీల ఏర్పాటులో ఆలస్యంపై అధినేత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈనెల 13 లోపు పూర్తి చేయాలని త్రీమెన్ కమిటీలను ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఆర్ఎస్ఎస్ ఎలాంటి పదవుల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా బీజేపీ కోసం పని చేస్తోందని గుర్తు చేశారు చంద్రబాబు. ఐడియాలజీ ప్రకారం పార్టీ క్యాడర్‌ని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో పడింది టీడీపీ నాయకత్వం. మొత్తానికి 15 ఏళ్లుపాటు ఏపీని పాలించాలన్న ఆలోచనకు అనుగుణంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఆ విధంగా పార్టీ కేడర్, నేతలను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ALSO READ: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్ లో మళ్లీ రాగులు, జొన్నలు