Amaravati: అమరావతి కేంద్రంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ వైపు రాజధాని రైతుల్లో ఆందోళనకు గురి చేస్తూనే, మరోవైపు అమరావతిని ఆపేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న కుట్రలను బయటపెట్టారు కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్. అంతేకాదు జగన్‌ని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయకుంటే ఏపీ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందన్నారు.
ఏపీ రాజధాని అమరావతిపై జగన్ కుట్రలు
ఏపీ రాజధాని అమరావతి పనులు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఓవైపు రాజధాని రైతులను రెచ్చగొడుతోంది. కంపెనీలు, పరిశ్రమలు విశాఖకు తరలిస్తున్నారని, అమరావతికి ఏమీ రావడం లేదంటూ ప్రచారం చేస్తోంది. ఇంకోవైపు ‘అమరావతి బిల్లు వెనక్కి’ అంటూ తాటికాయంత అక్షరాలతో ఓ వార్తను వైసీపీ పత్రిక ప్రచురించింది.
దీనిపై అగ్నిమీద గుగ్గిలం అయ్యారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గురువారం ఉదయం మీడియా ముందుకొచ్చిన ఆయన, ఈ అంశంపై నోరు విప్పారు. జగన్ ఎంత అడ్డుపడినా అమరావతి గెజిట్ ఏ మాత్రం ఆగదని తేల్చిచెప్పేశారు. అమరావతి గెజిట్ ఆగిపోయిందంటూ జగన్ తన పత్రికలో విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
బయటపెట్టిన కేంద్రమంత్రి పెమ్మసాని
అమరావతి గెజిట్ నోటిఫికేషన్ 2014 నుంచి ఇవ్వాలా? 2024 నుంచి ఇవ్వాలా అనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోందన్నారు. చిన్న చిన్న సాంకేతిక అంశాలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్‌ను రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్ర బాగుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి బిల్లు ఆగిపోయిందంటూ ఆయన రాక్షశానందం పొందుతారని, అలాంటి ఆనందం పొందే విధంగా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. అమరావతి బిల్లులో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నాయన్నారు. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే, ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై పని చేస్తున్నట్లు చెప్పారు.
ALSO READ: కెనడాలో మంత్రి నారా లోకేష్.. వ్యాపారవేత్తలతో సమావేశం
కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనా, వచ్చే సమావేశాల్లో కచ్చితంగా బిల్లు పెట్టి తీరుతామన్నారు. ఇదే క్రమంలో జగన్ కుట్రలను బయటపెట్టారు. అమరావతి నిర్మాణానికి డబ్బులు ఇవ్వొద్దని ప్రపంచబ్యాంకు కు పదేపదే లెటర్ రాస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ బిల్లు ఆపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఇటీవల తాడేపల్లిలో జగన్ మూడు గంటలపాటు ప్రెస్‌మీట్ పెట్టారు. చివరలో మీడియా మిత్రులు మూడు రాజధానుల గురించి చెప్పాలని కోరారు. ఇప్పుడు సమయం లేదంటూ మీడియా సమావేశం నుంచి ప్పించుకుని వెళ్లిపోయారు మాజీ సీఎం జగన్.