E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : పోటీ నుంచి తప్పుకున్న సుమన్ శెట్టి..ఏడ్చేసిన సంజన..ఇది జోక్ కాదు..

Bigg Boss 9 Telugu Promo : పోటీ నుంచి తప్పుకున్న సుమన్ శెట్టి..ఏడ్చేసిన సంజన..ఇది జోక్ కాదు..
Advertisement

Bigg Boss 9 Telugu Promo : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారమవుతుంది. దాదాపు 14 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది.. ఈ క్రమంలో ఆడియన్స్ కి మరింత ఆసక్తి నెలకొల్పేలా బిగ్ బాస్ డిఫరెంట్ టాస్క్లను ఇస్తున్నాడు. ప్రస్తుతం హౌస్ లో 14 వారం నామినేషన్స్ కాకుండా నెంబర్స్ కోసం పోటీ పడాలని చెప్పారు. ఈ నెంబర్స్ ను గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో తెగ కష్టపడి పోతున్నారు. హౌస్ లో నాల్గొవ రోజు యుద్ధం మొదలైంది. తాజాగా ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

పోటీ నుంచి సుమన్ శెట్టి అవుట్.. 

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో.. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని బిగ్ బాస్ అంటాడు.. సుమన్ లీడర్ బోర్డులో అందరి కంటే మీరు తక్కువగా ఉన్న కారణంగా మీరు ఈ పోరు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ పోరు నుంచి మీరు తప్పుకోవడానికి ముందుగా మీకు వచ్చిన స్కోరు అలాగే లక్ష్య నుంచి సగం ఎవరికిస్తారో నిర్ణయించుకోండి అని బిగ్ బాస్ చెప్తాడు. ఆ మాట వినగానే హౌస్ లోని వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారు. ఇంటర్ సభ్యులలో మీ స్కోర్ ని ఎవరికీ ఇస్తారు నిర్ణయించుకోండి అని బిగ్ బాస్ అంటాడు. ఆ మాట వినగానే సుమన్ శెట్టి ఎమోషనల్ అవుతాడు.. ఇక సుమన్ శెట్టి భరణితో బయటికి వస్తాడు. నా మిగిలిన పాయింట్లన్నీ మీకు ఇద్దామని అనుకుంటున్నాను అన్న.. నాకు ఈ హౌస్ లో మీరు తప్ప నాకు ఎవరూ లేరు అని సుమన్ శెట్టి అంటాడు. ఈ స్కోర్ నాకన్నా ఎవరికీ బాగా ఉపయోగపడతాయో ఒకసారి ఆలోచించండి అని భరణి అంటాడు. సంజనకు తన స్కోర్ ఇవ్వాలని అనుకుంటాడు. ఆ మాట వినగానే సంజన కన్నీళ్లు పెట్టుకుంటుంది.. బిగ్ బాస్ కు సంజన కు ఇస్తున్న విషయాన్ని చెప్తాడు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ అవుతుందని ప్రోమోను చూస్తే తెలుస్తుంది.

Advertisement

Also Read : పెళ్లి వద్దని మహా గోల.. మాధవ్ కోసం గాయత్రి పూజలు..చక్రి, మహా కలుస్తారా..?  

ఇది జోక్ కాదు.. బిగ్ బాస్ టాస్క్.. 

ఈవారం లీడర్ బోర్డ్ లో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న యుద్ధం ఇది జోక్ కాదు.. ఈ టాస్క్ లో ముందుగా పోటీదారులు తమ బాలుని ఎదురుగా కనిపిస్తున్న జోకర్ మొహానికి తగిలేలా వేయాలి అని బిగ్ బాస్ అంటాడు. ఎవరైతే ఎక్కువగా స్కోర్ చేసుకుంటారు లీడర్ బోర్డులో తమ స్కోర్ ని పెంచుకుంటారో వాళ్లే విన్నర్ గా నిలుస్తారని బిగ్ బాస్ అంటాడు.. సుమన్ శెట్టి యుద్ధం నుంచి తప్పుకోవడంతో మిగిలిన ఐదుగురు పోటీలో నిలుస్తారు. భరణి సంచాలక్ గా ఉంటాడు. అందరూ కూడా ఈ పోటీలో గెలిచేందుకు బాగానే కష్టపడతారు.. ప్రోమో ని చూస్తుంటే సంజనకు భరణి బాగా సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.. మొత్తానికి జోక్ కాదు టాస్క్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు ఈ యుద్ధంలో విన్నర్ గా నిలుస్తారో తెలియనుంది…

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×