Varra Ravindra Threat: సంతోషం కొన్నాళ్లు.. కష్టాలు ఇంకొన్నాళ్లు.. ఏపీలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అధికారం ఉన్నప్పుడు నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు ఎత్తితే హడలిపోతున్నారు. అసలేం జరుగుతోంది.
సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి గురించి కీలక విషయాలు వెల్లడించారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి. వర్రాకి వైసీపీ నుంచే ప్రాణ హాని ఉందని వ్యాఖ్యానించారు. వర్రా విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందన్నారు.
వర్రా అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వారే లీకులు ఇస్తున్నారని, తప్పించుకున్నా డంటూ మరోసారి పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు టీడీపీ నేత. ఈ మేరకు దాదాపు మూడు నిమిషాల నిడివి గల వీడియో విడుదల చేశారు బీటెక్ రవి.
వైసీపీ నుంచే అతడికి ప్రాణానికి హాని ఉందనే సూచనలు కనిపిస్తున్నాయని మనసులోని మాట బయటపెట్టారు టీడీపీ నేత. అతడికి ప్రాణ హాని కలిగించి ఆ నెపాన్ని పోలీసులు, కూటమి ప్రభుత్వం మీదకు నెట్టేసి నింద వెయ్యాలని చేస్తోందన్నారు. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ALSO READ: చిక్కుల్లో సజ్జల, భార్గవ్‌రెడ్డి.. ఆచూకీ కోసం పోలీసుల వేట
ఇదిలావుండగా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యాలన్నారు. రాఘవరెడ్డి పాత్ర కీలకమైనది చెప్పుకొచ్చారు. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కీలకంగా ఉన్నాడని తెలిపారు. వర్రా రవీంద్రరెడ్డి… రాఘవరెడ్డితో టచ్‌లో ఉన్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లెక్కన వైసీపీలో తెర వెనుక ఏదో జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
వర్రా రవీంద్రా కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి pic.twitter.com/uTxJwwXUZY
— ChotaNews (@ChotaNewsTelugu) November 9, 2024