Lucky Baskhar Collections : దుల్కర్ సల్మాన్… మమ్ముట్టి కొడుకు, మలయాళ నటుడు అనేవి ఇప్పటి వరకు ఆయనకు ఉన్న ట్యాగ్ నేమ్స్. ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ నటుడు, తెలుగుంటి హీరో అంటూ ఇంకా చాలా పేర్లు పెట్టి పిలుస్తున్నారు. మలయాళ నటుడు అయినా… తన టెస్ట్ కి తగినట్టు మాత్రమే కాకుండా, ఆడియన్స్ మెచ్చేలా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు. మహానటితో మార్క్ క్రియేట్ చేసే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. సీతారామంతో తెలుగులో సెట్ అయిపోయాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీతో మరోసారి తెలుగుతో పాటు సౌత్ ఆడియన్స్‌ను మెప్పించాడు.
ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, దుల్కర్ సల్మాన్‌కు ఒకటి మాత్రం అందని ద్రాక్షలానే ఉంది. మలయాళ మెగాస్టార్ కొడుకుగా సినిమాలకు ఎంట్రీ ఇచ్చినా… ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టినా… కెరీర్‌లో ఒక్క సారి కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరలేకపోయాడు.
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతరామంతో ఆ కళ నేరవేరిందని అనుకున్నారు అంతా. మంచి పాజిటివ్ టాక్ రావడంతో దుల్కర్ @100 కోట్లు అనే ట్యాగ్ వేసుకొవచ్చు అని అనుకున్నారు. కానీ, ఆ సీతారామం సినిమా కలెక్షన్లు 98 కోట్ల దగ్గరే ఆగిపోయింది.
దీని తర్వాత అంతటి టాక్ ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీకి వచ్చింది. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ అమరన్, క సినిమాలకు గట్టి పోటీ ఇచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ టాక్ కూడా వచ్చింది. దీంతో దుల్కర్‌కు ఈ సారి ఆ ద్రక్ష అందడం పక్కా అనుకున్నారు. ఈ సినిమా రిలీజై నేటికి 9 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే రన్ అవుతుంది.
అయితే, ఈ లక్కీ భాస్కర్ మూవీ కలెక్షన్లకు బ్రేక్ పడే టైం వచ్చింది. నవంబర్ 14న సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా కంగువ రిలీజ్ కాబోతుంది. తమిళ సినిమా అయినా… పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. పైగా తెలుగులోనూ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎస్ఎస్ రాజమౌళితో పాటు పలువురు సెలబ్రెటీలు రావడంతో సినిమాపై అప్పటి వరకు ఉన్న నెగిటివిటి మొత్తం పోయింది. దీంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రావొచ్చు. థియేటర్స్ కూడా ఎక్కువే దక్కబోతున్నాయి ఈ సినిమాకు.
దీంతో లక్కీ భాస్కర్ కలెక్షన్లపై ప్రభావం ఉంటుంది. అలా… ఈ సారి కూడా దుల్కర్ సల్మాన్ కి సెంచరీ మిస్ అవ్వబోతుందని ట్రెండ్ పండితులు అంటున్నారు. రెండో సారి కూడా 100 కోట్ల దగ్గర వరకు వచ్చిన దుల్కర్ కు మరో 100 కోట్ల మూవీ ఎప్పుడు వస్తుందో…
దుల్కర్ రాబోయే సినిమాతో తెలుగులోనే ఉండబోతుంది. పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. దీనికి వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా అయినా… 100 కోట్లు కలెక్ట్ చేసి, దుల్కర్ కెరీర్‌లో ఆ మైలు రాయిని అందేలా చేస్తుందా అనేది చూడాలి మరి.