E-Paper
Advertisement

రూటు మార్చిన విజయసాయిరెడ్డి.. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు, అసలు వీక్‌నెస్ అదే

రూటు మార్చిన విజయసాయిరెడ్డి.. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు, అసలు వీక్‌నెస్ అదే
Advertisement

Vijayasaireddy: సీనియర్ రాజకీయ నేత విజయసాయిరెడ్డి మళ్లీ లైమ్‌లైట్ లోకి వచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఆయన నేతల బలాలు, బలహీనతలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రతిపక్షనేత రాహల్‌గాంధీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. ఇంతకీ ఆయన వ్యాఖ్యలు దేనిపై తెలుసా?

రాహుల్ గాంధీపై సాయిరెడ్డి కామెంట్స్

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయరెడ్డి. ప్రజలతో ఆయన మమేకం కాలేకపోవడానికి ప్రస్తావించారు. అందుకు గల కారణాలను ప్రత్యేకంగా వివరించారు. రాహుల్ భాషా నైపుణ్యాలపై కాసింత విమర్శలు గుప్పించారు కూడా. ఈ మేరకు ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడతారని కితాబు ఇచ్చేశారు. దేశ రాజకీయాల్లో గెలవాలంటే ప్రజలు రోజూ మాట్లాడే భాషపై పట్టు ఉండాలన్నారు. రాహుల్ హిందీ మాటలు వింటుంటే ఎవరో అనువదించి చెబుతున్నట్లు ఉంటుందన్నారు. హిందీలో ఇంగ్లీష్ పదాలు, యాస స్పష్టంగా కనిపిస్తాయన్నారు. స్థానిక నుడికారాలు, జాతీయాలు అస్సలు ఉండవన్నది సాయిరెడ్డి మాట.

కనెక్ట్ కాలేకపోవడానికి అసలు కారణం?

Advertisement

రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో ఆలోచించి హిందీలో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందన్నారు. ఆ తరహా మాటలతో సామాన్యులకు కనెక్ట్ కాలేకపోతున్నారని మనసులోని మాట బయపెట్టారు. ప్రజల భాషలో మాట్లాడటమే రాజకీయ విజయానికి పునాదిగా చెప్పుకొచ్చారు. ఆ విషయంలో రాహుల్ వెనుకబడ్డారన్నది సాయిరెడ్డి మాట. విజయసాయిరెడ్డి ఉన్నట్లుండి రాహుల్‌ని ప్రస్తావించడం వెనుక అసలు కథేంటి? అటువైపు ఆయన మొగ్గు చూపుతున్నారా? జనాలు మరిచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ఫేమస్సయిన నేతలను టచ్ చేస్తూ ట్వీట్లు చేయడం ఎందుకు? అన్నది కొందరి ప్రశ్న.

నెటిజన్స్  ఏమంటున్నారు?

ఇక సాయిరెడ్డి చేసిన పోస్టుకు నెటిజన్స్ అదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. మనకు ఉచ్చారణను సరిదిద్దే రిఫరీ కూడా వచ్చారని, మీరు ఏం చేసినా సరే.. బీజేపీ మిమ్మల్ని తమ పార్టీలో చేర్చుకోదన్నాడు. తాతయ్యా.. ఇదంతా మీకు ఎందుకు అని మరొకరు ప్రశ్న. సాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపినట్టు అనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి జనాలు మరిచిపోకుండా వారానికి లేకుంటే రెండు వారాలకు ఒక్కసారి పోస్టులు పెడుతూ తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎంపీ.

Advertisement

ALSO READ: ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. పూర్తి వివరాలు వెల్లడించిన సీఈవో

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×