E-Paper
Advertisement

రామాయణ ట్రైలర్ లో సాయి పల్లవి పాత్రనే డామినేట్ చేసిన శ్రుతకీర్తి ఎవరో తెలుసా?

రామాయణ ట్రైలర్ లో సాయి పల్లవి పాత్రనే డామినేట్ చేసిన శ్రుతకీర్తి ఎవరో తెలుసా?
Advertisement

Ramayana Trailer:దర్శక రచయితలు ఒక స్క్రిప్ట్ అనుకునేటప్పుడు.. కొంతమందిని ఆయా పాత్రలలో అనుకుంటూ స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా స్క్రీన్ టెస్ట్ కూడా చేస్తారు. అన్నీ ఓకే అయ్యాక ఆ పాత్రలు తెరపైకి వస్తే.. ఆ పాత్రలలోని వారి కంటే వారి వెనకాలో లేక పక్కన ఉన్న వారికో ఆ పాత్ర సరిగ్గా సెట్ అయ్యేదేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ బడ్జెట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఇతిహాస గాధ రామాయణ. దీని ట్రైలర్ ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు.

సాయి పల్లవినే నామినేట్ చేసిన ఈ అమ్మాయి ఎవరు?

ఇందులో సాయి పల్లవి సీత పాత్ర కంటే ఆమె వెనుక శ్రుత కీర్తి పాత్రలో ఉన్న అమ్మాయి నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. కోమలమైన మోముతో.. కెమెరా ఆమె వైపు ఫోకస్ లేకపోయినా అందరి దృష్టిని ఆకట్టుకుంది . దీంతో ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సాయి పల్లవి పాత్రనే ఈమె డామినేట్ చేసేసింది అంటూ పోస్టులు పెట్టి మరీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

నెట్టింట మొదలైన కొత్త చర్చ..

Advertisement

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ (Nithesh tiwari) దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా (Namith Malhotra) సుమారుగా 4 వేల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో ఏమంత గొప్పగా లేదు అని.. ముఖ్యంగా సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఆమె పక్కన కనిపించిన అమ్మాయి చాలా బాగుంది అంటూ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పైగా ట్రైలర్ లో ఆ సన్నివేశాలను కట్ చేసి మరీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఆ అమ్మాయి ఫేస్ పై రౌండ్ అప్ చేసి మరీ రచ్చ చేస్తున్నారు. మరి సాయి పల్లవిని డామినేట్ చేసిన ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం.

 

Advertisement

ALSO READ:ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

సాయి పల్లవి వెనుకాల నిల్చొని, ట్రైలర్ లో ఒక్క షాట్ లో కనిపించి, ఇంతగా చర్చకు దారి తీసిన ఈ అమ్మాయి పేరు సురభి దాస్ (Surabhi Dass). అస్సాంకు చెందిన ఈమె రామాయణ కంటే ముందు నిమా డెంజోంగ్పా అనే ఒక టీవీ షోలో లీడ్ రోల్ పోషించింది. ఇప్పటికీ ఈ టీవీ షో ఎపిసోడ్స్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ రామాయణ సినిమాలో సీత చెల్లెలు శ్రుతకీర్తి పాత్రలో ఈమె అవకాశాన్ని దక్కించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఇంస్టాగ్రామ్ లో సుమారుగా తొమ్మిది లక్షల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. మొత్తానికి అయితే ఈ సినిమాలో సాయి పల్లవి సీతాదేవి పాత్ర పోషిస్తున్నప్పటికీ.. నటి సురభి దాస్ అందం మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా భారతీయ కట్టు బొట్టులో ఆమె కనిపించిన తీరు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను ఒక్క సన్నివేశంతో కొల్లగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా సాయి పల్లవి కంటే కూడా ఈమెను సీత పాత్రలో తీసుకోవాల్సింది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×