E-Paper
Advertisement

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!

ఆరేళ్ల బ్యాటరీ గ్యారెంటీతో భారత్‌లోకి వచ్చేసిన Vivo T5x 5G.. లాంచింగ్ ఆఫర్‌తో తక్కువ ధరకే పొందొచ్చు!
Advertisement

Vivo T5x 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో.. తమ పాపులర్ మొబైల్ T5x 5Gని ఇప్పుడు కొత్త ‘ఫ్యూజన్ రెడ్’ రంగులో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్‌తో వస్తున్న ఈ వేరియంట్ వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ప్రముఖ రీటైల్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగా కలర్ మారడం తప్ప మిగిలిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ పాత మోడల్‌లాగే ఉంటాయి.

ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8GB + 128GB వేరియంట్ రూ.27,999, అలాగే 8GB + 256GB టాప్ మోడల్ రూ.30,999కి లభిస్తున్నాయి. లాంచ్ ఆఫర్‌ కింద యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌లపై రూ.2,000 తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్లను ప్రారంభంలో రూ.22,999 నుంచే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: రీఛార్జ్ రేట్లు పెరిగినా డోంట్ కేర్.. రూ.1849కే ఏడాది పొడవునా ఎయిర్‌టెల్ ప్లాన్ ఉందిగా!

Vivo T5x 5Gలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని 7200mAh భారీ బ్యాటరీ గురించే. దీనికి 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ బ్యాటరీ దాదాపు ఆరేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ప్రాసెసింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్ వాడారు. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

ఇందులో 6.76 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా, ముందు వైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండింటిలోనూ 4K వీడియోలు రికార్డ్ చేయవచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తున్న ఈ ఫోన్‌ను గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్‌లో తయారు చేశారు.

Also Read: ఫోన్ వర్షంలో తడిసినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కాపాడుకునే ‘మాస్టర్ టిప్’ ఇదిగో!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×