Big Stories

Vijayawada: డ్రైనేజీలో గల్లంతైన బాలుడు దుర్మరణం.. ఈ పాపం ఎవరిది?

- Advertisement -

Vijayawada: విజయవాడ అంటేనే మురుగు కాలువల నగరం. ఓవైపు కృష్ణా నది ప్రవహిస్తుంటే.. దానికి పోటీనా అన్నట్టు డ్రైనేజీలు పొర్లి పొంగుతుంటాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలే.. కాలువలంత వెడల్పుగా ఉంటాయి. వాటిపైన ఎలాంటి పైకప్పు ఉండదు. గబ్బు వాసనతో ముక్కులు పగిలిపోవాల్సిందే. ఇలాంటి దారుణ పరిస్థితుల్లోనే ఎలాగోలా బతికేస్తుంటారు చాలామంది బెజవాడ వాసులు. కానీ, తాజాగా మరింత దారుణం జరిగింది. ఆ డ్రైనేజీ ఓ బాలుడిని మింగేసింది.

- Advertisement -

మధ్యాహ్నం నుంచి విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఆ వానక మురుగు కాలువలన్నీ వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఆ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఆ ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. కాలువ నిండుగా నీరు పారుతుండటంతో.. ఆ నీటి ఉధృతికి ఆ పిల్లాడు కొట్టుకుపోయాడు.

విజయవాడలోని గురునానక్ కాలనీలో జరిగిందీ దారుణం. ఆరేళ్ల అభిరామ్ ఓపెన్ డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. అతని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది. తమ బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించారు.

గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ తర్వాత బాలుడి మృతదేహం కనిపించింది. ఆయుష్ ఆస్పత్రి సమీపంలో అభిరామ్ డెడ్‌బాడీని గుర్తించారు రెస్క్యూ టీమ్. తమ పిల్లాడు ప్రాణాలతో తిరిగొస్తాడని భావించిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదమే మిగిలింది. అభి చనిపోయాడన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.

బాలుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు స్థానికులు. డ్రైనేజీలపై పైకప్పు వేయాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నేతలు, అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News