BigTV English

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

చదువుకోవాల్సిన వయసులో కుర్రాళ్లు చేసే పనులు చూస్తే భయంతో వణికే పరిస్థితులు దాపరించాయి. కొంత మంది డ్రగ్స్, మద్యం బానిసలుగా మారుతుంటే, మరికొంత మంది ఈజీ మనీ కోసం చెడుమార్గాలు పడుతున్నారు. ఓ 17 ఏళ్ల కుర్రాడు మరో అడుగు ముందుకేసి ఐఫోన్, ఐప్యాడ్ కొనుగోలు చేసేందుకు ఏకంగా తన కిడ్నీ అమ్మేశాడు. ఇప్పుడు ఆ యువకుడి పరిస్థితి ఏంటంటే..


జీవితాన్ని నాశనం చేసుకున్న యువకుడు

నచ్చిన ఐఫోన్, ఐప్యాడ్ కొనుగోలు చేయడానికి వాంగ్ షాంగ్‌ కున్ అనే చైనీస్ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వాటి కోసం డబ్బు సమకూర్చుకునేందుకు ఓ కిడ్నీని బ్లాక్ మార్కెట్ లో అమ్మేశాడు. సుమారు దశాబ్దం తర్వాత ఇప్పుడు ఆ యువకుడు శాశ్వత వికలాంగుడిగా మారిపోయాడు. వల్లమాలిన కోరికలు జీవితాన్ని ఎంత దారుణంగా మార్చుతాయో చెప్పేందుకు వాంగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారాడు.

17 ఏళ్ల వయసులో ప్రమాదకరమైన ఒప్పందం

చైనాలోని ఒక పేద కుటుంబానికి చెందిన వాంగ్ షాంగ్‌ కున్.. 2011లో తన కిడ్నీలలో ఒకదాన్ని 20,000 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 2.5 లక్షలు) అమ్మాడు. ఆ డబ్బుతో తనకు నచ్చిన ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు సంతోషంగానే జీవితాన్ని గడిపినా, రాబోయే ప్రమాదాల గురించి ఆలోచించలేదు. ఒక కిడ్నీ సరిపోతుందని భావించాడు. కానీ, ఆ తర్వాత తన రెండో కిడ్నీ సమస్య ఏర్పడ్డంతో అసలు కథ మొదలయ్యింది.


సోషల్ మీడియాలో యాడ్ చూసి..

సుమారు 14 ఏండ్ల క్రితం చేసిన దిద్దుకోలేని తప్పు గురించి వాంగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2011లో రాత్రిపూట ఫోన్ చూస్తుండగా, ఆన్‌ లైన్ చాట్ రూమ్‌ లో ఒక అవయవ అక్రమ రవాణాదారుడి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. “ఒక కిడ్నీని అమ్మండి, మీకు 20,000 యువాన్లు లభిస్తాయి” అని ఆ మెసేజ్ లో ఉంది. మనిషి ఒక కిడ్నీ మనిషికి సరిపోతుందని వాంగ్ ను నమ్మించాడు. చివరకు అతడి మాటలు విని వాంగ్ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు. హునాన్ ప్రావిన్స్‌ లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న హాస్పిటల్లో అతడికి ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు. వాంగ్ డబ్బు తీసుకొని తనకు నచ్చిన కొత్త ఆపిల్ గాడ్జెట్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు.

కొద్ది రోజుల్లోనే కిడ్నీ ఇన్ఫెక్షన్!

వాంగ్ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. కొన్ని నెలల్లోనే మిగిలిన కిడ్నీ సమస్య తలెత్తింది. కిడ్నీ తీసుకునే సమయంలో చేసిన ఆపరేషన్ సందర్భంగా సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ సోకింది. వాంగ్‌ ను తిరిగి ఆసుపత్రికి తరలించారు, అక్కడ పరీక్షల్లో అతడి కిడ్నీ పని తీరు 25 శాతానికి పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.  ఇప్పుడు వాంగ్ వయసు 31 సంవత్సరాలు. కిడ్నీ రోగిగా మారిపోయాడు. ప్రస్తుతం డయాలసిస్ మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. యంగ్ ఏజ్ లో అతడు తీసుకున్న ప్రమాదకర నిర్ణయం కారణంగా ఇప్పుడు ఎప్పుడు ప్రాణాలు పోతయో తెలిని పరిస్థితితో బతుకీడుస్తున్నాడు.

Read Also:  బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Related News

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Free Fuel: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Nun Garba Dance: ‘నన్’ వేషంలో గర్బా డ్యాన్స్.. నెట్టింట వీడియా వైరల్.. ఇదేం పైత్యమంటూ కామెంట్స్

Watch Video: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

Big Stories

×