Amazon Offers: అమెజాన్‌లో షాపింగ్ అంటే చాలా మందికి ఇష్టమే. చిన్న చిన్న వస్తువుల నుండి పెద్ద ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ ఒకే చోట లభిస్తాయి. అయితే షాపింగ్ చేస్తూ మనకి పెద్ద తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ వస్తే అదో ప్రత్యేకమైన ఆనందం కదా! అలాంటి ఆఫర్‌నే తాజాగా సిబిఎస్ బ్యాంక్ తన ఎడ్జ్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డు ద్వారా అందిస్తోంది.
షాపింగ్ చేస్తే 10శాతం క్యాష్‌బ్యాక్
ఈ కార్డు ద్వారా మీరు అమెజాన్‌లో షాపింగ్ చేస్తే నేరుగా 10శాతం అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంటే, సాధారణంగా అమెజాన్ ఆఫర్లు ఇస్తే వేరే, ఈ కార్డు వాడితే అదనంగా మరో 10శాతం రిటర్న్ మీ ఖాతాలోకి వస్తుంది. షాపింగ్ చేయాలనుకునే వారికి ఇది నిజంగా మంచి లాభదాయకమైన ఆఫర్ అని చెప్పాలి. ఇక కార్డు పొందడం కూడా అంత కష్టమేమీ కాదు. జ్యూపిటర్ యాప్‌లో ప్రత్యేకంగా ఈ కార్డు అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసి, కొన్ని ప్రాథమిక వివరాలు నింపితే సులభంగా ఈ క్రెడిట్ కార్డు పొందవచ్చు.
Also Read: Redmi Note 14 SE: దీపావళి స్పెషల్ డీల్.. రూ.12,999కే రెడ్మీ నోట్ 14 ఎస్ఈ 5జి, ఫీచర్స్ అదుర్స్
10శాతం అంటే 1000 రూపాయలు
ఇప్పుడు మీరు 10,000 రూపాయల విలువైన ఒక ల్యాప్‌టాప్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేశారని. ఈ కార్డు వాడితే 10శాతం అంటే 1000 రూపాయలు మీకు తిరిగి వస్తాయి. అదే మీరు పెద్ద మొత్తంలో షాపింగ్ చేస్తే క్యాష్‌బ్యాక్ కూడా అంతకంతకూ పెరుగుతుంది. అదనంగా, ఈ కార్డు ద్వారా ఇతర ఖర్చులపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. అయితే అమెజాన్ వంటి ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పై 10శాతం అదనపు లాభం రావడం వలన చాలా మంది వినియోగదారులకు ఇది ఆకర్షణీయంగా మారింది.
రూపే క్రెడిట్ కార్డు
కార్డు ఉపయోగించి చెల్లింపులు చేసినప్పుడు, లావాదేవీలు డిజిటల్‌గా సురక్షితంగా జరుగుతాయి. రూపే క్రెడిట్ కార్డు కావడం వలన, యూపీఐలో కూడా ఇది లింక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అంటే మీ చెల్లింపులు వేగంగా, సురక్షితంగా, అదనపు ప్రయోజనాలతో కూడి ఉంటాయి. ప్రస్తుతం షాపింగ్ ట్రెండ్స్‌ను చూస్తే, ఎవరైనా కొనుగోలు చేయడానికి ముందు ఏ ఆఫర్లు ఉన్నాయో పరిశీలించడం సహజం.
అలాంటి సమయంలో ఈ సిబిఎస్ బ్యాంక్ ఎడ్జ్+ రూపే క్రెడిట్ కార్డు మీకు డబ్బు ఆదా చేయడమే కాకుండా, ఒక మంచి షాపింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అందువల్ల మీరు కూడా త్వరగా ఈ కార్డు కోసం అప్లై చేసి, మీ షాపింగ్‌ను లాభదాయకంగా మార్చుకోండి. ప్రతి సారి అమెజాన్‌లో కొనుగోలు చేస్తే ఆ 10శాతం అదనపు క్యాష్‌బ్యాక్ మీకు ఒక చిన్న గిఫ్ట్‌లా అనిపిస్తుంది.