Dhruv Jurel: టీమిండియా స్టార్ క్రికెటర్ ధృవ్ జురెల్ కన్నీటి గాధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో అదరగొట్టిన ధృవ్ జురెల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. తన కెరీర్ లో అంతర్జాతీయ తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసుకున్న ధృవ్ జురెల్, జీవితం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అతనికి చిన్నప్పుడే ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని, ఆ తర్వాత క్రికెట్ కిట్ కొనిచ్చేందుకు ధృవ్ జురెల్ తల్లి బంగారు గొలుసు తాకట్టు కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అనేక కష్టాలు పడిన ధృవ్ జురెల్, టీమ్ ఇండియాలో స్థానం సంపాదించుకొని ఇప్పుడు రఫ్ఫాడిస్తున్నాడు.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
టీమిండియా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కు తన చిన్నతనంలోనే ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. బస్సు ప్రమాదంలో ధృవ్ జురెల్ ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం కారణంగా ధృవ్ జురెల్ ఎడమ కాలుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించాల్సి వచ్చిందట. గాయం తీవ్రమైనది కావడంతో… ప్లాస్టిక్ సర్జరీ చేశారట వైద్యులు. ఐదు సంవత్సరాల వయసులోనే ఆగ్రాలో బస్సు టైర్ కింద అతని కాలు పడినట్లు తెలుస్తోంది.
కాలికి ప్లాస్టిక్ సర్జరీ జరిగినప్పటికీ తన తండ్రి ఆర్మీ అధికారిగా చేస్తున్న సాహాసాలను చూసి స్ఫూర్తి పొందాడు. ప్రాణాలు పోయినా సరే దేశం కోసం పోరాడాలని క్రికెట్లోకి వచ్చాడు ధృవ్ జురెల్. ఈ నేపథ్యంలోనే కుటుంబం నుంచి కూడా మంచి సహాయం అందింది. అదే సమయంలో ధృవ్ జురెల్ కు క్రికెట్ కిట్ కొనిచ్చేందుకు, తన బంగారు గొలుసు కూడా తాకట్టు పెట్టింది ఆయన తల్లి. అలా బస్సు ప్రమాదం, ధృవ్ జురెల్ కెరీర్ మొత్తాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. తాజాగా వెస్టిండీస్ జట్టుపై తొలి సెంచరీ నమోదు చేయడంతో ధృవ్ జురెల్ జీవిత గాథ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్టులో మేడిన్ సెంచరీ నమోదు చేసుకున్నాడు ధృవ్ జురెల్. ఆస్ట్రేలియాలో అవకాశం వచ్చిన పెద్దగా రాణించని ధృవ్ జురెల్, వెస్టిండీస్ పై సెంచరీ నమోదు చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఐదు టెస్టులు ఆడిన ధృవ్ జురెల్, ఒక హఫ్ సెంచరీ తో పాటు ఒక సెంచరీ నమోదు చేసుకున్నాడు. అటు టి20 లో నాలుగు మ్యాచ్ లలో అవకాశం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో 41 మ్యాచ్ లు ఆడిన ధృవ్ జురెల్ 680 పరుగులు చేశాడు.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
Plastic surgery on leg at the age of 5, mother pawning her necklace to buy him a cricket kit. Dhruv Jurel is a star in the making. pic.twitter.com/HAXMWgcrDV
— Ankit Jain (@indiantweeter) October 3, 2025