E-Paper
Advertisement

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!
Advertisement

Nagadurga OTT: ఫోక్ క్వీన్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ  ఇప్పుడు హీరోయిన్ గా వెండి తెరపై సత్తా చాటేందుకు రెడీ అయిపోయింది.ఈ క్రమంలోనే తమిళ నాట ‘లవ్ ఓ లవ్’ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.అయితే సక్సెస్ పరంగా సినిమా అంతంత మాత్రంగానే వసూల్లని రాబట్టిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా దూసుకెళ్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ లిస్టులో ‘లవ్ ఓ లవ్’ 

Advertisement

ఈ  మధ్యే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘లవ్ ఓ లవ్’ విడుదలైన కొద్ది రోజుల్లోనే ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం.ఇక ఇదే క్రమంలో స్ట్రీమింగ్‌లో ఉన్న కొన్ని హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి ఈ మూవీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ఇక్కడ మరో విశేషం.ఇక ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కూ మంచి ఆదరణ లభిస్తుండటంతో మంచి వ్యూస్ వస్తున్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

విడుదలైన ఐదు రోజుల్లోనే రెండు మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ రావడం మెచ్చుకోతగ్గ విశేషం.ముఖ్యంగా నాగదుర్గ నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో చూపించిన నటనపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోక్ ఆర్టిస్ట్‌గా మాత్రమే తెలిసిన నాగదుర్గ.. హీరోయిన్‌గా కూడా ఆకట్టుకోగలదని ఈ సినిమాతో నిరూపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్

ఈ సినిమాలో హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ నటించాడు. కొత్త జంటగా పవీష్, నాగదుర్గ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిందని సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ చూస్తేనే  అర్థమవుతోంది. దర్శకుడు మగీష్ రాజేంద్రన్ ఈ చిత్రాన్ని నేటి యువత ప్రేమ,పెళ్లి, బాధ్యతలు, డబ్బు విషయంలో ఎలా ఆలోచిస్తుందనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందించాడు.

కథ విషయానికి వస్తే..

కథ విషయానికి వస్తే.. రఘు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. అప్పులు చేయడం ఇష్టం లేని రఘు.. అవంతికను ప్రేమిస్తాడు. కానీ ప్రేమ పేరుతో అవంతిక చేసే ఖర్చులు, విలాసవంతమైన జీవనశైలి కారణంగా రఘు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కుటుంబ సభ్యులతో కూడా దూరమవుతాడు. చివరకు దేశం విడిచి దుబాయ్ వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు.

అయితే పరిస్థితులు అనుకోని మలుపు తిరిగి మహిళా మండలి నాయకురాలు పెట్టిన కేసు కారణంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నుంచి అతని జీవితం ఎలా మారింది? అవంతికతో అతని ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? చివరకు రఘు తన జీవితాన్ని ఎలా గాడిలో పెట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు  సమాధానమే ఈ సినిమా.

ఈ ఫోక్ క్వీన్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్తుందో

అయితే థియేటర్లలో మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. సుమారు రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయల మార్కును కూడా దాటలేకపోవడం గమనార్హం.కానీ అదే సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు oTT లో ఈ సినిమాను చూసి తెగ మెచ్చేసుకుంటున్నారు.మొత్తానికి నాగదుర్గకు హీరోయిన్‌గా ఇదొక మంచి బిగినింగ్ అనే చెప్పాలి.

also read :ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

ఇక రీసెంట్ గా ప్రియదర్శితో ఇడుపు కాయితం అనే మరో సినిమాకి నాగ దుర్గ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే.చూడాలి ముందు ముందు ఈ ఫోక్ క్వీన్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్తుందో !

Tags

Related News

ఏడుగురు రాజకుమారులు… ఒక్కోరికీ ఒక్కో శక్తి… యానిమే లవర్స్ కు ఫుల్ మీల్స్

రాజభవనం వదిలేసి రోడ్డుపైకి… మనసు ముక్కలైన వాళ్లకి మెడిసిన్ ఇచ్చే కొరియన్ డాక్టర్ కథ

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఓవైపు… వెంటాడుతున్న కరడుగట్టిన క్రిమినల్ మరోవైపు… మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్

5 కోట్లు మాయం… రెండేళ్ల క్రితమే కన్నుమూసిన డైరెక్టర్ చివరి సినిమా… ప్రియమణి కొత్త క్రైమ్ థ్రిల్లర్ ని ఫ్రీగా ఎక్కడ చూడాలంటే ?

20 ఏళ్ల క్రితం ఓడిపోయాడు… ఇప్పుడు 17 ఏళ్ల కుర్రాడితో కలిసి చరిత్ర సృష్టించబోతున్నాడు… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ డ్రామా

ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

కవల సోదరుల మధ్య చిచ్చు… కొడుకు మరణంతో తుపాకీ పట్టిన తల్లి… చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ

బాక్సింగ్ రింగ్‌లో కింగ్‌… జాతి వివక్షను ఎదిరించి ప్రపంచాన్నే షేక్ చేసిన బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీ రియల్ స్టోరీ

Big Stories

Advertisement
×