E-Paper
Advertisement

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్
Advertisement

Action Thriller Series: యాక్షన్ సిరీస్ అంటే కేవలం తుపాకులు, కార్ చేజ్‌లు మాత్రమే కాదు. ప్రతి ఫైట్ వెనుక బలమైన ఎమోషన్ ఉంటేనే ఆ కథ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది. అలాంటి హై-వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్‌తో రూపొందిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘Furious’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 27న డిజిటల్ గా విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఎపిసోడ్‌లో ఇంటెన్స్ ఫైట్స్, ఊహించని ట్విస్టులు, కూతురిని రక్షించుకోవడానికి ప్రాణాలకైనా తెగించే తండ్రి పోరాటం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. రా మార్షల్ ఆర్ట్స్ యాక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ తో ఈ సిరీస్‌తో ఓటీటీలో దుమ్మురేపుతోంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒకప్పుడు ప్రపంచ స్థాయి మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మన హీరో. గతాన్ని పక్కన పెట్టి తన కుటుంబంతో బతుకుతుంటాడు. అతని ప్రపంచం మొత్తం తన ఒక్కగానొక్క కూతురే. అయితే అతనికి తెలియకుండా అతని పాత శత్రువులు ఎన్నో సంవత్సరాలుగా ప్రతీకారం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

Advertisement

ఒక రోజు అంతర్జాతీయ క్రిమినల్ నెట్‌వర్క్ అతని కూతురిని కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ వెనుక ఉన్నవారు కేవలం డబ్బు కోసం కాదు, పాత పగ తీర్చుకోవడానికే ఈ ప్లాన్ అమలు చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు రంగంలోకి దిగినా పెద్దగా ఉపయోగం కనిపించదు. సమయం గడిచే కొద్దీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఇక తన కూతురిని కాపాడుకోవాలంటే తానే రంగంలోకి దిగాలని హీరో నిర్ణయించుకుంటాడు. ఎన్నో సంవత్సరాలుగా వదిలేసిన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను మరోసారి బయటకు తీస్తాడు. ఒక్కో క్లూను వెంబడిస్తూ క్రిమినల్ గ్యాంగ్ సభ్యులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. ప్రతి ఫైట్‌లో అతని కోపం, బాధ, తండ్రి ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి. చేతికి దొరికిన ప్రతి ఆయుధాన్ని ఉపయోగిస్తూ శత్రువులను చిత్తు చేస్తాడు.

Advertisement

దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కిడ్నాప్ వెనుక ఓ గ్యాంగ్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి క్రైమ్ సిండికేట్ ఉందనే విషయం బయటపడుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్‌గా ఎమ్మీ రోసమ్ పాత్ర రంగంలోకి దిగుతుంది. ఆమె దర్యాప్తు, హీరో యాక్షన్ ఒకేసారి సాగుతూ కథను మరింత ఉత్కంఠగా మార్చేస్తాయి. చివరికి కూతురిని సురక్షితంగా రక్షించగలిగాడా ? అసలు ఈ కిడ్నాప్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరు ? పాత శత్రుత్వానికి కారణమేంటి ? అనే విషయాలను మాత్రం సిరీస్ క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌గా ఉంచారు.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘ఫ్యూరియస్’లో ప్రధాన ఆకర్షణ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్. ఎలాంటి అతిశయోక్తులు లేకుండా రియలిస్టిక్ ఫైట్ కొరియోగ్రఫీతో ప్రతి సీన్‌ను రూపొందించారు. చేజింగ్ సీక్వెన్సులు, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్, గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ అభిమానులకు థ్రిల్ ఇస్తాయి. ఎమోషనల్ ఫాదర్-డాటర్ బాండింగ్ కథకు బలాన్ని ఇస్తే, ప్రతి ఎపిసోడ్ చివరలో వచ్చే ట్విస్టులు తర్వాతి ఎపిసోడ్ వెంటనే చూడాలనే ఆసక్తిని పెంచుతాయి. ప్రస్తుతం ఈ సిరీస్ JioHotstarలో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతోంది. మార్షల్ ఆర్ట్స్, క్రైమ్ థ్రిల్లర్, రివెంజ్ డ్రామాలు ఇష్టమైతే ఈ సిరీస్‌ను డోంట్ మిస్.

Read Also: ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×