Jio vs Vi Rs 3599 Plan: టెలికాం రంగంలో వార్షిక ప్లాన్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. ఏడాది పొడవునా రీఛార్జ్ తిప్పలు లేకుండా రోజూ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించే ప్లాన్‌ల కోసం వినియోగదారులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. ఈ రేసులో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో పాటు వినూత్న ఆఫర్లతో ఆకట్టుకునే వోడాఫోన్ ఐడియా (Vi) ముందంజలో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఈ రెండు కంపెనీలు సరిగ్గా రూ.3,599 ధరతో ఒకే వాలిడిటీ ఉన్న వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఎక్కువ లాభం చేకూర్చే ప్లాన్ ఏది? డేటా ఎందులో ఎక్కువ వస్తుంది? ఫైనల్గా రెండింటిలో ఏది బెస్ట్? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.
జియో తన వినియోగదారులకు రూ.3,599 ప్లాన్ ద్వారా భారీ డేటాను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2.5 GB చొప్పున మొత్తం ఏడాదికి 912.5 GB డేటా పొందొచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ కింద అర్హులైన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. అదనపు ప్రయోజనాల కింద జియో యాప్స్ కంటెంట్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ ను సైతం యూజర్ పొందవచ్చు.
వోడాఫోన్ ఐడియా (Vi) సైతం ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్ ప్రతీరోజూ 2GB డేటా పొందొచ్చు. అంటే ఏడాదికి 730GB వాడుకోవచ్చు. అలాగే ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఇందులోనూ యథావిధిగా లభిస్తాయి. అయితే వీఐ అందిస్తున్న అదనపు బెనిఫిట్స్ ఈ ప్లాన్ లో హైలెట్స్ గా నిలుస్తున్నాయి ‘బింజ్ ఆల్ నైట్’ కింద అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి పరిమితి లేకుండా అపరిమిత డేటాను యూజర్ వాడుకోవచ్చు. అలాగే సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు వాడకుండా మిగిల్చిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే వెసులుబాటును వీఐ కల్పిస్తోంది. నెలకు 2GB వరకూ బ్యాకప్ డేటాను సైతం యూజర్లు పొందొచ్చు.
Also Read: వినియోగదారుల కోర్టు మెుట్టికాయలు.. యాపిల్ దిగొచ్చింది.. ఐఫోన్ యూజర్ గెలిచాడు!
పగటిపూట ఎక్కువ డేటా కావాలి అనుకుంటే జియో అందిస్తున్న రూ.3,999 ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వీఐ కంటే రోజుకు 500 MB డేటాను ఎక్కువగా ఇస్తుంది. మీ ఏరియాలో జియో 5G నెట్ వర్క్ ఉంటే అపరిమితంగా 5G వాడుకోవచ్చు. ఒకవేళ మీరు రాత్రిపూట సినిమాలు, సిరీస్‌లు ఎక్కువగా చూస్తుంటే.. వీఐ ప్లాన్ అద్భుతంగా సరిపోతుంది. పగటిపూట డేటా మిగిలిపోయినా వృథా కాకుండా వీకెండ్‌లో వాడుకునే సదుపాయం ఉండటం ఈ ప్లాన్ కు సంబంధించిన మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాబట్టి మీ అవసరానికి తగ్గట్లుగా ఉన్న ప్లాన్ ను మీరే ఎంచుకోండి.
Also Read: సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!